Fire Accident in Park Hyatt: పార్క్ హయత్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. SRH ప్లేయర్లు సేఫేనా..?

Fire Accident in Park Hyatt: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో వైర్లు కాలడంతో ప్రమాదం చోటు చేసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 14, 2025, 02:06 PM IST
Fire Accident in Park Hyatt: పార్క్ హయత్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. SRH ప్లేయర్లు సేఫేనా..?

Fire Accident in Park Hyatt: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తుల్లో మంటలు ఎగిసిపడగా.. భారీగా పొగలు అలుముకున్నాయి. హోటల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. విద్యుత్‌ వైర్లు కాలడంతోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. 

కాగా.. ఇదే హోటల్‌లో సన్‌రైజర్స్ టీమ్ ఆటగాళ్లు బస చేస్తున్నారు. హోటల్‌లో ప్రమాదం సంభవించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్‌లోని పర్యాటకులు, టూరిస్టులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని హోటల్ సిబ్బంది తెలిపారు. 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News