KCR Released Video: మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు. త్వరలోనే మీ నడుమకు వస్తానని అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానన్నారు. అప్పటిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్‌లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు. హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. తనతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదన్నారు. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు తనను బయటకు పంపుతలేరని అన్నారు. యశోద దవాఖానకు రాకండని కోరారు.


"ఈ రోజు తరలివచ్చిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులకు నా నమస్కారాలు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో యాశోద ఆసుపత్రిలో ఉన్నా. బయటకు వెళితే ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్య బృందం నన్ను సీరియస్‌గా హెచ్చరించింది. ఇన్ఫెక్షన్ వస్తే మరికొన్ని నెలలు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. మీ అభిమానానికి వెయి చేతులు ఎత్తి దండం పెడుతున్నా.. కింద ట్రాఫిక్ సిబ్బంది కలిగించవద్దు. మనతోపాటు హాస్పిటల్‌లో వందలాది మంది పేషంట్లు ఉన్నారు.


ఎక్కువమంది ఒకేసారి రావడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మరో 10 రోజులు ఎవరూ ఆసుపత్రికి చుట్టు రావద్దండి. నాకు బాగైన తరువాత నేను ప్రజల మధ్యకు వస్తా. నేను ఎప్పుడు ప్రజల మధ్య ఉండే మనిషిని. అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నా.." అని కేసీఆర్ వీడియోలో కోరారు.