)
Former cm kcr wife Shobha visits Mlc kalvakuntla Kavitha house: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత అంశం బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయన్న కవిత .. కొన్నిరోజుల క్రితం ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్రస్థాయిలో మండిపడింది.
అంతేకాకుండా.. వీరిద్దరే అసలైన ద్రోహులు అంటూ గులాబీ దళపతి, కేటీఆర్ లు జాగ్రత్తగా ఉండాలని కూడా మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కవితపై సీరియస్ అయ్యింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు నిర్ణయం తీసుకుంది.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన కూడా కవిత తరచుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై మండిపడుతునే ఉన్నారు. అయితే.. తాజాగా.. మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లడం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.
సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. బుధవారం రాత్రి జరిగిన అల్లుడు అనిల్ పుట్టిన రోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తన బిడ్డ కవితకు కొన్నిసూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల పాటు గుమ్మునుంటే.. సమస్యలు అన్ని అవే చక్కబడతాయని కవితకు తల్లి దిశానిర్దేషం చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో దీనిపై కవిత అధికారికంగా స్పందిస్తే తన తల్లి ఏమైన చెప్పిందనే వార్తలపై ఒక క్లారిటీ రానుంది. మరోవైపు కవిత మాత్రం..సింగరేణి అవినీతిపై ఏకంగా సీబీఐ కు ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook