)
Former minister Harish Rao Slams on cm Revanth reddy Govt: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటలు పీక్స్ కు వెళ్లాయి. ఒకరిపై మరోకరు వాక్బాణాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పాలనను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఎండకట్టారు.
ఈ నేపథ్యంలో హరీష్ రావు.. తాజాగా... తెలంగాణ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ బందు చేయడం అంశంపై మాట్లాడారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా.. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు కొనసాగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు చేస్తున్నాయన్నారు.
విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు అంటూ ఏకీపారేశారు. మరోవైపు.. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందు అంటూతీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రైతులకు రుణ మాఫీ బందు, పంట బోనస్ బందు, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బందు.. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బందు నడుస్తుందని మండిపడ్డారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు.. అంటూ హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి.. నీ చేతగాని, దద్దమ్మ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మరోవైపు ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారని, మీ డ్రామాలను బందు పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్విట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook