)
Former minister harish rao slams on cm revanth reddy: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనలు పడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఎక్కడ దొరికిన కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విమర్శలు ఎక్కిపెట్టింది.
రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు నల్లమల పిల్లి
రేవంత్ రెడ్డి మొన్న ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నా
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు
ఆలమట్టి… pic.twitter.com/k50iSwuu7R
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2025
దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది. ఇటీవల పెంచిన బస్సు చార్జీలపై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. "రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు... నల్లమల పిల్లి" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న రాష్ట్రాలు కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుని పోతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటంతో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
ఇటీవల రేవంత్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ఇటీవల కర్ణాటకకు వెళ్లిన రేవంత్ రెడ్డి, అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ఎందుకు మాట్లాడలేదని హరీశ్ రావు ఏకీపారేశారు. ఆల్మట్టి డ్యామ్ వల్ల తెలంగాణ ఎడారిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సొంత పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రంకు.. రేవంత్ రెడ్డి కనీసం కూర్చుని మాట్లాడి సమస్య పరిష్కరించలేని స్థితిలో ఉన్నారన్నారు. కనీసం రాహుల్ గాంధీతో అయిన మాట్లాడిఈ సమస్యకు పరిష్కారం కోసం చొరవ చూపలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేవలం ఢిల్లీకి బ్యాగులు మోయడమే కాదని, కానీ తెలంగాణ బాగోగులను కూడా పట్టించుకోవాలని సెటైర్ లు వేశారు. ముఖ్యంగా.. ఏపీ 463 టీఎంసీలు, కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీల నీటిని ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి? కింద గోదావరి, పైన కృష్ణా నీళ్లు వాళ్లు తీసుకుపోతే మనతెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
తరచూ తనను తాను ‘నల్లమల బిడ్డ’ అని చెప్పుకునే తిరిగే రేవంత్ రెడ్డి.. కనీసం నల్లమలను ఆనుకుని ప్రవహించే కృష్ణా నదికి, మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంటే ఏంచేస్తున్నారని మండిపడ్డారు. అందుకే రేవంత్.. నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా?.. అంటూ ఏకీపారేశారు. ఒక వేళ పులి అయితే గర్జించేవాడివి. పిల్లివి, ఎలుకవు కాబట్టే మౌనంగా ఉన్నావంటూ హరీష్ రావు ఏకీపారేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook