)
Former minister Jagadish reddy demands disqualification of 10 mlas: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం మరోసారి హట్ గా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దీనిపై ఒకరిపై మరోకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి , అసెంబ్లీ బీ ఆర్ ఎస్ విప్ కె .పి .వివేకానంద , ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని తాము స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. అదే విధంగా ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో మూడు నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. స్పీకర్ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని, కొంతమంది ఎమ్మెల్యేలు మేము అమాయకులం,కేసీఆర్ పైన నమ్మకం ఉందని స్పీకర్ కు వివరణ ఇచ్చారన్నారు.
దీనిపై మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని పంపిస్తూ మూడు రోజుల్లో మమ్మల్ని సమాధానం ఇవ్వాలని చెప్పిన విషయం బైటపెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చిన స్పీకర్ మాకు మాత్రం తమకు మూడు రోజులే సమయం ఇచ్చారని అన్నారు. అయితే.. స్పీకర్ గడువు ఇచ్చిన మూడు రోజుల్లోనే మేము సమాధానం ఇచ్చామన్నారు. మేము పార్టీ మారలేదు, సీఎం దగ్గరకు వెళ్తే మా మెడలో మూడు రంగుల కండువా కప్పారు అని ఎమ్మెల్యేలు చెప్పడం చాలా హస్యాస్పదంగా ఉందన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయాకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారని రుజువులతో సహా జగదీశ్వర్ రెడ్డి బైటపెట్టారు. పోచారం మాటలను ఏ.ఐ ద్వారా ఏమైనా మార్ఫింగ్ చేశారా అంటూ పంచ్ లు వేశారు.
నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అంటే సీఎం మా ఇంటికి వచ్చారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ పై నమ్మకం ఉంటే కేసీఆర్ ఫోటో, కేసీఆర్ కండువా ఉండాలి కదా.. అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ, మహేష్ కుమార్ గౌడ్ ను ఎందుకు కలిశారని ఏకీపారేశారు.
మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే సడెన్ గా సీఎం కండువా కప్పారని చెప్పారన్నారు. సంజయ్ పేపర్ ప్రకటనల్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉన్నారని ఫైర్ అయ్యారు. గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటే అభివృద్ధి ఎట్లా అవుతుందన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. తాము తప్పుచేసి పార్టీ మారామని నియోజకవర్గ ప్రజల ముందు ఒప్పుకోవాలని అదే విధంగా పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటీషన్ పెట్టుకోండని సెటైర్ లు వేశారు. నోటీసులు వచ్చాక కేసీఆర్ దగ్గరకు రావాల్సిన పదిమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారని మండిపడ్డారు.
ఎన్ని చేసినా పదిమంది ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు.. పదిమంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయిన దొంగలు అంటూ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు.. అదే విధంగా.. తాము తప్పించుకోలేమా అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.. ఇది అసాధ్యమన్నారు. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
పదిమంది ఎమ్మెల్యేలు ఇక్కడ తప్పించుకున్నా కోర్టుముందు తప్పించుకోలేరని జగదీశ్వర్ రెడ్డి పార్టీమారిన ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఉప ఎన్నికలు రావడం ఖాయం .. మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా ప్రజలు చేయడం ఖాయంయంటూ జగదీశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook