Former mp anjan kumar Yadav sensational comments on jubilee hills by poll ticket: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతుంది. మరోవైపు కాంగ్రెస్ లో ఇటీవల పొన్నంప్రభాకర్, అడ్లూరీల మధ్య రచ్చ పీక్స్ కు చేరింది. ఇది కాస్త పీసీసీ చీఫ్ వరకు వెళ్లింది. ఇద్దర్ని కూర్చుండబెట్టి మాట్లాడి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పడంతో వివాదంకు బ్రేకులు పడ్డాయి.
ఇక తాజాగా.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జుబ్లీహిల్స్ ఉపఎన్నికలలో తనకు అవకాశం ఇస్తారని భావించారు. కనీసం ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా జుబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేతను, మాజీ ఎంపీని ఇన్నాళ్లు కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్న తనను అంటరాని వాడిలా చూశారంటూ అలకబూనారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది.ఈ క్రమంలో దీనిపై మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో.. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఏకీపారేశారు. తనకు టికెట్ రాకుండా చేసిన వారి బండారం తొందరలోనే బైటపెడ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో కూడా ఉన్నామని తనపై ఐటీ రైడ్స్ జరిగాయన్నారు.
రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నామని, కనీసం టికెట్ ఇవ్వకుంట.. ఫలానా వ్యక్తికి ఇస్తున్నామని ఒక్కమాట చెప్పరా..?.. సీనియర్లకు కాంగ్రెస్ వారు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ కమిటీలో కూడా నన్ను తీసుకోలేదన్నారు. వాళ్లు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే, మేము ఎక్కుకుంటూ పోతామన్నారు.
నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు.అదే విధంగా.. కార్యకర్తలతో భేటీ తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో అలిగిన అంజన్ కుమార్ యాదవ్.. బుజ్జగించడానికి ఇంటికి బయల్దేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలు రంగంలోకి దిగారు. అదే విధంగా సాయంత్రం అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి మీనాక్షి నటరాజన్ వెళ్లనున్నారు. ఈక్రమంలో అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









