Venkaiah Naidu: స్మగ్లర్లు, దేశ ద్రోహులు హీరోలా.?.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు.. వీడియో వైరల్..

Hyderabad: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరబాద్ లోని ఫిలింనగర్ కల్చరర్ సెంటర్ కు వచ్చారు. అలనాటి నిర్మాత, గాయని శ్రీమతి కృష్ణవేణి గారి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 09:32 PM IST
  • సీరియస్ అయిన మాజీ ఉపరాష్ట్రపతి..
  • సినిమాలు మంచి మెస్సెజ్ ఇవ్వాలని వ్యాఖ్యలు..
Venkaiah Naidu: స్మగ్లర్లు, దేశ ద్రోహులు హీరోలా.?.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు.. వీడియో వైరల్..

Venkaiah naidu comments on movie industry: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు వచ్చారు. అలనాటి మహానటి, నిర్మాత  శ్రీమతి కృష్ణవేణి గారి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు.  శ్రీమతి కృష్ణవేణి  101 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపి.. సినిమా రంగానికి ఎనలేని సేవలు చేశారు. ఈ క్రమంలో ఆమె  జీవితం నుంచి నేర్చుకొవాల్సిన అనేక గొప్ప విషయాలను, అలనాటి ఆమె ఆదర్శవంతమైన జీవితం గురించి అనేక సంఘటనలను వెంకయ్య నాయుడు సభలో పంచుకున్నారు.

Add Zee News as a Preferred Source

 

సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..  శ్రీమతి కృష్ణవేణి గారు కళామతల్లికి ఎంతో సేవలు చేశారన్నారు. అయితే.. అదే విధంగా ఇటీవల వస్తున్న సినిమాల మీద వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అంటే వ్యాపారంలా మారిపోయిందన్నారు.  ఇది  ప్రజలను ప్రభావితం చేస్తుందన్న విషయంను మర్చిపోతున్నారన్నారు. ముఖ్యంగా సినిమాలో ఇటీవల స్మగ్లర్లను, దేశ ద్రోహులను హీరోలుగా చూపిస్తున్నాని తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. దీని వల్ల సమాజంపై చెడు ప్రభావం ఉంటున్నారు. 
 

సినిమా రంగంలో ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ సంప్రదాయాలు, మంచి భాష, హుందాతనానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాలో ఇదంతా లోపించిందని అన్నారు. గతంలో కూడా సినిమాలు తీసేవారని... విలన్లు ఉండేవారని.. కానీ ఆ సినిమాల నుంచి మంచి మెస్సెజ్ లు ఉండేవని అన్నారు.

కానీ ఇప్పుడు మాత్రం.. విలన్ లను, దేశ ద్రోహులను అదేదో హీరోలుగా చూపిస్తున్నారని.. దీని వల్ల సమాజం పెడద్రోవ పడుతుందని వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే... గతేడాది విడుదలైన పుష్ప2 మూవీ తరచుగా వివాదాల్లో ఉంటుంది. దీనిలో అల్లు అర్జున్ గంధపు చక్కల స్మగ్లర్ గా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ మీద భారీగా వసూళ్లను రాబట్టింది.

Read more: Himani Narwal Mother Video: నా కూతుర్ని చంపింది కాంగ్రెస్ వాళ్లే..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన హిమానీ నర్వాల్ తల్లి.. వీడియో వైరల్..

ఈ సినిమా ఎంత ఫెమస్ అయ్యిందో, అంతకు మించి కాంట్రవర్సీ అంశాలతో వార్తలలో నిలిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుష్ప2 మూవీ గురించి ఇన్ డైరెక్ట్ గా టాలీవుడ్ కి చురకలు పెట్టారని నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మొత్తంగా  మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు సెటైర్ లతో పుష్ప2 మూవీ మరోసారి వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News