)
Woman passenger brutally attacks on rtc lady conductor video: ఇటీవల ఉచిత బస్సు ప్రయాణాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. గతంలో చిల్లర కోసం ప్రయాణికులు డ్రైవర్లతో, కండక్టర్ లతో వాగ్వాదంకు దిగేవారు. ఎప్పుడో ఒకసారి గొడవలు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించారో తరచుగా బస్సులో గొడవలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అంతే కాకుండా.. కొంత మంది మహిళలు మరీ రెచ్చిపోయి సీట్ల కోసం కండక్టర్ లతో, తోటి ప్రయాణికులతో ఫైటింగ్ లకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నాయి. మొత్తంగా ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణాల్ని మంచి ఉద్దేష్యంతో తీసుకొచ్చిన కొంత మంది చేస్తున్న పనుల వల్ల తరచుగా వివాదాలు వార్తలలో ఉంటున్నాయి.
మహిళా కండక్టర్‌పై దాడి చేసిన మహిళా ప్రయాణికురాలు
ఉచిత బస్సు పథకం వల్ల తన్నులు తింటున్న ఆర్టీసీ సిబ్బంది
హైదరాబాద్ నగరంలో ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్‌పై దాడి చేసిన మహిళా ప్రయాణికురాలు
ఎక్కడపడితే అక్కడ బస్సును ఆపము అని చెప్పినందుకు డ్రైవర్,… pic.twitter.com/WhcPZ66Kgx
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025
ఈ క్రమంలో తాజాగా.. హైదరాబాద్ లో ఒక మహిళ నడి రోడ్డు మీద వీరంగం చేసింది. కండక్టర్ , డ్రైవర్ ను ఇష్టమున్నట్లు బూతులు తిడుతూ దాడులు చేసింది. హైదరాబాద్ నగరంలో ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఒక మహిళ రచ్చ చేసింది. అయితే.. సదరు మహిళ స్టాప్ లో కాకుండా.. వేరే చోట ఆపమని చెప్పింది. కానీ అసలే వర్షాలు, రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఉంటుంది.
ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి కుదరదని స్టాప్ వచ్చే వరకు ఆగాలని లేడీ కండక్టర్ నెమ్మదిగా మహిళ ప్రయాణికురాతో చెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఆమె.. డ్రైవర్ ను బూతులు తిడుతూ రెచ్చిపోయింది. బస్సు ఎందుకు ఆపరని నానా రచ్చ చేసింది. దీంతో బస్సు ఆపడంతో .. ఆమెతో లేడీ కండక్టర్ మాట్లడుతుండగానే ఆమెపై దాడి చేసింది.
ఇష్టమున్నట్లు కొడుతూ నానా బీభత్సం చేసింది. అక్కడున్నవారు చెబుతున్న కూడా ఆ మహిళ ప్రయాణికురాలు అస్సలు వెనక్కు తగ్గడంలేదు. మొత్తంగా ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అయిన.. ఇలాంటి దాడులు ఏంట్రా బాబోయ్ అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒక వైపు ఉచిత బస్సు ప్రయాణంపై రేవంత్ సర్కారు మహిళలకు మేలు చేశామని భావిస్తున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్ లు వేస్తుంది. తమ హయాంలో ఇంత ఘోరం ఎప్పుుడు చూడలేదని ఏకీపారేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook