Gadwal murder case: మహా ముదురు టెంకీ.. మొగుడ్నే కాదూ.. తమ్ముడ్ని కూడా లేపేసిందా..?.. వెలుగులోకి షాకింగ్ నిజం.!.

tejeshwar surveyor murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటనలో పోలీసులు తాజాగా.. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తిరుమల రావును పోలీసులు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 25, 2025, 01:09 PM IST
  • సర్వేయర్ హత్య కేసులో మరో ట్విస్ట్..
  • తిరుమల రావు అరెస్ట్..
Gadwal murder case: మహా ముదురు టెంకీ.. మొగుడ్నే కాదూ.. తమ్ముడ్ని కూడా లేపేసిందా..?.. వెలుగులోకి షాకింగ్ నిజం.!.

Gadwal surveyor tejeshwar murder case: గద్వాల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇష్టముందని చెప్పి, పెళ్లి చేసుకుని మరీ నెల తిరక్కుండానే భర్తను సుపారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించింది కట్టుకున్న భార్య. ఈ క్రమంలో భర్త డెడ్ బాడీని పోలీసులు.. కర్నూలు శివారులో గుర్తించారు. ఈ నేపథ్యంలో తేజేశ్వర్ సోదరుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు బైటపడుతున్నాయి.  

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో..తేజేశ్వర్ భార్యకు, అతని తల్లికి .. బ్యాంక్ మెనెజర్ తిరుమల రావుకు వివాహేతర సంబంధం ఉంది. అయితే.. తిరుమల రావుకు కూడా పెళ్లి అయి ఎనిమిదేళ్లయిన పిల్లలు లేరు. దీంతో అతను కూడా తన భార్య హత్యకు ప్లాన్ వేసినట్లు విషయం బైటపడింది. అప్పటికే సుపారీ గ్యాంగ్ ఐశ్వర్య భర్తను హత్య చేశాక.. వారికి కొంత డబ్బులను ఇచ్చారు. ఐదుసార్లు అప్పటికే భార్య చంపడానికి ప్లాన్ లు వేసిందంట. ఆరోసారికి వేసిన ప్లాన్ కు తేజేశ్వర్ చనిపోయాడని అంటున్నారు.

ఐశ్వర్య, తిరుమల రావు ఇద్దరు కలిసి లడక్ కు పారిపోయి అక్కడే ఉండాలని భావించారు. ఈ క్రమంలో ఐశ్వర్య, ఆమె తల్లి, సుపారీ గ్యాంగ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా.. తిరుమల రావును సైతం అరెస్ట్ చేశారు. అయితే.. ఐశ్వర్య , అతని తల్లి  ఇద్దరు బ్యాంక్ మెనెజర్ తో పెళ్లికి ముందే వాళ్ల ఇంట్లోనే రొమాన్స్ చేసుకునే వారని.. ఇది అతని తమ్ముడు గమనించి, పలు మార్లు హెచ్చరించాడని విషయం బైటపడింది.

ఈ విషయంలో పలుమార్లు తమ్ముడికి, ఐశ్వర్యకు గొడవలు జరిగాయంట. ఇంతలో నెల రోజుల క్రితం ఐశ్వర్య తమ్ముడు అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇంట్లో వాళ్లు ప్రమాద ఘటనగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఐశ్వర్య యవ్వారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. స్థానికులు సైతం.. ఆమె తమ్ముడ్ని కూడా ఐశ్వర్య, ఆమె తల్లి చంపి ఉంటారని కూడా చెప్పుకుంటున్నారు.

Read more: Gadwal Murder Case: గద్వాల సర్వేయర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్... వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఇంత స్కెచ్ వేశారా..?..

మరోవైపు ఐశ్వర్యకు తిరుమల రావు మాత్రమే కాకుండా.. మరికొందరితో కూడా సీక్రెట్ యవ్వారాలు ఉన్నాయని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం టెన్త్ మాత్రమే చదివిన ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేదనిస్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో తేజేశ్వర్ హత్య కేసు విచారణ చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News