)
Hyderabad Imd weather update Rain alert for Telangana: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా గణపయ్య విగ్రహాల నిమజ్జనాల సందడి కన్పిస్తుంది. గణపయ్యల్ని భక్తి శ్రద్దలతో ఊరేగింపులుగా తీసుకెళ్లి నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటలను జరక్కుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో రానున్న మరికొన్నిగంటలలో వరుణుడు మరల తన ప్రతాపం చూపించనున్నాడని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీ చేసింది.
ముఖ్యంగా.. భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, వికారబాద్, నిజామాబాద్, మహబూబాబాద్,మెదక్, ములుగు, మేడ్చల్ .. మొదలైన జిల్లాలలో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్ర హెచ్చరికల్ని జారీ చేసింది.ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లో కూడా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఒకవైపు హైదరాబాద్ లో ఎక్కడ చూసిన గణపయ్య విగ్రహల నిమజ్జనం కోలాహలం కన్పిస్తుంది. భాగ్యనగర వాసులు మాత్రమే కాకుండా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం భారీగా ట్యాంక్ బండ్ వద్ద విగ్రహల నిమజ్జనంను చూసేందుకు వస్తున్నారు. రేవంత్ సర్కారు ప్రత్యేకంగా ఆర్టీసీ, మెట్రొ సర్వీసుల్ని కూడా ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే.. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో కొంత సేపు వర్షం కురిసింది. వాతావరణ శాఖ అలర్ట్ తో జీహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. గణపయ్య విగ్రహాల నిమజ్జనంను చూసేందుకు వచ్చిన వారు మాత్రం ఒకింత అసౌకర్యానికి గురౌతున్నారు. వర్షం పడుతుండటంతో.. చెట్ల కింద, దుకాణాల దగ్గర షెడ్డుల్లో వెళ్లి కాసేపు వర్షం నుంచి తడవకుండా టెంపరరీగా షెల్టర్ లో ఉంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook