German Woman Gangrape in Hyderabad: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి కానీ, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన తీవ్ర కలకలంరేపింది. పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మబలికి కారులో ఎక్కించుకున్నారు దుండగులు. అయితే, మార్గమధ్యంలో ఆమె సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. అయితే, వారి చెర నుంచి తప్పించుకున్న జర్మనీ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక జర్మనీ యువతి తన స్నేహితురాలిని కలవడానికి వచ్చి తిరుగు వెళ్తూ మిర్‌పేట ప్రాంతంలో వాహనం కోసం ఎదురు చూస్తోంది. అయితే, లిఫ్ట్ ఇస్తాం అని కారులో ఇద్దరు వచ్చారు. పహాడీ షరిఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను రేప్ చేశారు. ఆ కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలంలో సీసీ టీవీ ఫూటేజీని కూడా పర్యావేక్షిస్తున్నారు.
తెలంగాణ నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగి రెండు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో నిద్రకు వచ్చిన మహిళ రాత్రి సమయంలో మూత్రవిసర్జను బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యుడు ఒకరు కూడా తనతోపాటే వచ్చాడు. అక్కడే మాటు వేసుకుని కూర్చున్న 8 మంది మృగాళ్లు ఆ మహిళపై దారుణానికి పాల్పడ్డారు. కూడా వచ్చిన వ్యక్తిని దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేశారు. ఈ దారుణఖండలో ఆ ఆలయానికి చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అని తేలింది. అందులో ఆటోడ్రైవర్ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
READ ALSO: సామాన్యులకు బంపర్ గుడ్‌న్యూస్.. సిలిండర్ ధర ఏకంగా రూ. 41 తగ్గింపు..
READ ALSO: పాము కాటు వేస్తే వెంటనే ఈ కూరగాయతో రుద్దండి.. విషం వ్యాపించదు..
దైవ దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన మహిళతోపాటు ఇలా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణ ఘటనలు మహిళలపై జరుగుతున్నాయి. జర్మనీ యువతికి కారులో వచ్చిన యువకులు తాము డ్రాప్ చేస్తామని లిఫ్ట్ ఇచ్చి మరీ ఈ ఘోరానికి పాల్పడ్డారు. కారులోనే ఒకరి తర్వాత మరొకరు దారుణానికి పాల్పిడ్డారు. ప్రధానంగా విదేశీ మహిళ కావడంతో దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మళ్లీ అక్కడికే తీసుకువచ్చి ఆమెను వదిలేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









