)
Hyderabad Rs. 5 Breakfast Scheme: హైదరాబాద్‌లో పేదవాళ్లకు కేవలం రూ.5కే టిఫిన్ అందించేలా.. బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లలో.. సెప్టెంబర్ 29 నుంచి ఈ టిఫిన్ స్కీమ్‌ను అధికారులు స్టార్ట్ చేశారు. మొదటి దశలో 60 ప్రాంతాల్లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో GHMC బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులోకి తెచ్చారు.
ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ అందించనుంది. రోజుకు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించేలా.. జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. మెనూలో రోజుకో వెరైటీగా.. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉన్నాయి. క్యాంటీన్లు వారానికి ఆరు రోజులు ఓపెన్ చేసి.. ఆదివారం మాత్రం క్లోజ్ చేస్తారు.
నగరంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2013లో 5 రూపాయల భోజన కార్యక్రమం మొదలైంది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత GHMC పరిధిలోని రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్‌ను అధికారులు కొత్తగా మార్చారు. GHMC పరిధిలో 139 క్యాంటీన్ స్టాల్స్ ఉండగా.. ప్రస్తుతం వీటిని 150కి పెంచారు.
ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న బల్దియా.. రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చవుతుంది. ఇందులో రూ.5 ప్రజల నుంచి తీసుకుంటే, మిగిలిన రూ.14ను GHMC భరిస్తుంది. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి