)
Telangana Colleges Holiday: సెలవుల పండుగ అంటే ఆగస్టు నుంచి మొదలైంది. గత నెలలో పండుగలతోపాటు జాతీయ దినాలు భారీగా రావడంతో పెద్ద ఎత్తున సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌లో కూడా అదే రీతిలో భారీగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాల్లో దాదాపు ఐదారు సెలవులు రాగా.. తాజాగా మళ్లీ కళాశాలలకు వచ్చాయి. కాలేజీలకు నిరవధిక సెలవులు రావడం విద్యార్థులకు ఖుషీనిచ్చేదే కానీ అది ఒక సమస్య కారణంగా సెలవులు వచ్చాయి. 15వ తేదీ నుంచి కాలేజీల బంద్‌కు కళాశాలల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని.. వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి కాలేజీలు మూసివేస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యం హెచ్చరించింది. ఇంజనీర్స్ డేను బ్లాక్ డేగా ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి నోటీసులు కాలేజీల యాజమాన్యాలు అందజేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15వ తేదీ నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని శుక్రవారం కలిసిన యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం డిమాండ్ చేశాయి. విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజును ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ రోజును బ్లాక్ డేగా ప్రకటించారు. ఇంజినీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వృత్తి విద్యా కళాశాలలు బంద్ నిర్వహిస్తాయని తెలిపారు. డిగ్రీ, పీజీ కాలేజీలు 16వ తేదీ బంద్ చేపటట్టనున్నట్టు ప్రకటించాయి. రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన రూ.1,200 కోట్లు అయినా ఈనెల 30వ తేదీ నాటికి విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య డిమాండ్ చేసింది. కళాశాలలు బంద్ కొనసాగిస్తే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఉన్నత విద్యా మండలి, ప్రభుత్వం తక్షణం బకాయిలను విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.