Hyderabad Metro Rail: డిజిటల్ పరివర్తన , సేవల పొడిగింపుతో ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలు తీసుకుంటోంది. నగర రవాణాలో అగ్రగామిగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ నిలుస్తోంది. సరికొత్త ఆవిష్కరణలు, సామర్థ్యం, అవకాశాలు అందిస్తుండడంతో ప్రయాణికులు విశేషంగా సేవలు పొందుతన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సమయ పొడిగింపు, విద్యార్థుల ప్రయోజనాలతో సహా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో రైలు ఒక ప్రకటన చేసింది.
Also Read: K Kavitha: గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
పొడిగించిన రైలు సమయాలు
కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో హైదరాబాద్ మెట్రోకు భారీగా ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌కు అనుగుణంగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించటం కోసం మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయం 1 ఏప్రిల్ 2025 నుంచి 45 నిమిషాలు పొడిగించారు.ప్రస్తుతం ఉన్న రాత్రి 11:00 నుంచి అర్ధరాత్రి 11:45 గంటలకు పెంచారు. పెరిగిన సమయవేళలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. మొదటి రైలు టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఉదయం 7 గంటలకు ఆదివారాలలో సేవలను ప్రారంభిస్తుంది.
Also Read: Kannappa Movie: అభిమానులకు షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. కన్నప్ప సినిమా వాయిదా
విద్యార్థులకు కానుక
హైదరాబాద్ మెట్రోను విద్యార్థులు ఎక్కువగా వినియోగించుకుంటుండడంతో వారికి మెట్రో రైలు శుభవార్త వినిపించింది. 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులను విద్యార్థులు పొందే ఆఫర్ మెట్రో రైలు ప్రకటించింది. ఆ పథకాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించింది. ఇది మార్చి 31వ తేదీ 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్ 31 మార్చి 2025న ముగుస్తుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు పట్టణ పరివర్తన , సమాజ అభివృద్ధికి ఉత్ప్రేరకం అని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









