Govt Employees Holiday: తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపి వార్త. కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రత్యేక సెలవు లభించనుంది. ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఈనెల 27వ తేదీన ఉంది. దీంతో పోలింగ్ కోసం ఉద్యోగులకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ రోజున ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులకు వెసులుబాటు కల్పించింది.
Also Read: DK Aruna: 'ఎన్నికల్లో ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం'
ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ పమేలా సత్పతి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఈనెల 27వ తేదీన మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోయింది. అయితే రెండింటిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు, కంపెనీలకు కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
Also Rea: Anjan Kumar Yadav: 'కొడుకులు.. భజనగాళ్లు' అంటూ రెడ్డిలపై రెచ్చిపోయిన మాజీ ఎంపీ
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, పని గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక సాధారణ సెలవు, వెసులుబాట్లను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









