Holi Festival: హోలీ ఫెస్టివల్ స్పెషల్.. ఆ గ్రామంలో చాలా డిఫరెంట్ గురూ..!

Holi Festival Special: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే... కానీ కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తున్నాం..! పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ పద్ధతులు అవాలంభిస్తున్నాం. కానీ సిద్దిపేట జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు ఆ గ్రామంలో అందరు నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలతో సంప్రదాయ బద్దంగా రంగులను తయారు చేసి హోలీ పండగ జరుపుకుంటున్నారు..   

Written by - G Shekhar | Last Updated : Mar 13, 2025, 06:41 PM IST
Holi Festival: హోలీ ఫెస్టివల్ స్పెషల్.. ఆ గ్రామంలో చాలా డిఫరెంట్ గురూ..!

Holi Festival Special: దేశమంతా హోలీ పండుగకు సిద్దమైంది.. రంగుల పండుగకు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండటంతో.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అసలు హోలీ అంటేనే కలర్‌ ఫుల్‌.. యువత రంగుల్లో మునిగి తేలిపోతారు.. సహజ రంగులకు విరుద్దంగా డేంజరస్ కలర్లు వాడుతుండటంతో ఇబ్బందిగా మారుతోంది. డేంజరస్‌ కలర్లతో హోలీ ఆడటంతో.. చర్మంపై ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కానీ సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామం మాత్రం.. ప్రకృతి నుంచి వచ్చే సహజసిద్దమైన కలర్లు వాడుతూ హోలీగా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.. 
 
సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరి గ్రామంలో గ్రామస్తులు అందరు సంప్రదాయ బద్దంగా ప్రకృతి నుండీ సేకరించిన రక రకాల పువ్వులతో తయారు చేసిన రంగులతోనే  గత కొన్ని సంవత్సరాలుగా  హోలీ పండగ జరుపుకుంటున్నారు. మార్కెట్ లో దొరికే  వివిధ రంగులు, రసాయనాలకు దూరంగా ఉంటున్నారు. మోదుగు పువ్వులు, గోగి పువ్వులు, హోలీ పండుగ మాసంలో అడవుల్లో చెట్ల నిండా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు సేకరించి రంగులు చేసుకుంటున్నారు. గోగుపూలలో అందమే కాదు. ఎన్నో లాభాలూ ఉన్నాయి. మోదుగుతో ఆయుర్వేదంలో అనేక ఔషధాలు తయారు చేస్తారు.

Add Zee News as a Preferred Source

వీటి విత్తనాలను పొడిగా చేసి దానిలో కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మోదుగు పూల ఆకుల పొడి డయాబెటిస్‌ రోగులు వాడితే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. మోదుగు ఆకుల కషాయాన్ని వేడిగా ఉండగానే పుక్కిలిస్తే మౌత్‌ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది. మోదుగు గింజలను నూరి లేపనంగా వేస్తే తెల్లమచ్చలు, తామెర తగ్గిపోతుంది. పువ్వులను తింటే మూత్ర సమస్యలు తగ్గిపోతాయి. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు గ్రామస్తులు..
 
ఇక వసంతకాలంలో వచ్చే హోలీ పండుగ ప్రకృతి మార్పునకు చిహ్నం. చెట్ల ఆకులు రాలిపోయి చిగురించే కాలమిది. శిశిరంతో మోడుబారిన ప్రకృతి.. రంగుల పూలతో శోభాయమానంగా సింగారించుకొని వసంతున్ని స్వాగతిస్తుంది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో హోలీ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. హోలీ పండుగకు గోగుపూలకు విడదీయరాని బంధం ఉంది. గతంలో హోలీ వస్తుందంటే చాలు వారం రోజుల ముందుగానే పిల్లలు, యువకులు గోగుపూవులు తీసుకువచ్చి నీటిలో నానబెట్టేవారు. ఆ తర్వాత ఉడకబెట్టగా వచ్చే రంగు నీళ్లను సీసాలు, డబ్బాల్లో నింపుకుని హోలీ ఆడుతుండేవారు. సహజసిద్ధమైన ఈ రంగు నీళ్లతో ఎలాంటి రోగాలు వచ్చేవి కావు. అయితే ఆనాటి జ్ఞాపకాలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. అప్పటి కాలంలో వాడే రంగులను, సంప్రదాయాలను ఈ నాటి ప్రజలు పట్టించుకోవడం లేదు. కానీ గోవర్ధన గిరి గ్రామస్తులు మాత్రం ఇప్పటికి ప్రకృతి నుండి సేకరించిన పువ్వులతో హోలీ పండగ జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
మొత్తంగా హోలీ పండుగ అనగానే వివిధ కెమికల్స్‌ కలిపిన రంగులను వాడడం రొటీన్‌ అయిపోయింది. వీటితో అనేక రకాల చర్మవ్యాధులు, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి రంగులు కళ్లలో పడి కొందరు కళ్లు పోగోట్టుకుంటున్న ఘటనలు ఎదురువుతున్నాయి. ఈ నేపథ్యంలో హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: Best Voice Only Plans: 448 రూపాయలకే 84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ వాయిస్ ప్లాన్స్ ఇవే

Also Read: Bandi Sanjay Video: వారెవ్వా.. సింగర్‌గా మారిన కేంద్ర మంత్రి.. మోదీని పొగుడుతూ పాట.. వీడియో వైరల్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News