)
Govt Employess Attendance: తాజాగా తెలంగాణ ఇద్దరు పంచాయితీ కార్యదర్శకులు లు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫోటోతో అటెండెన్స్ నమోదు చేశారు. ఈ రంగారెడ్డి ఘటన వెలుగు చూసింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణభి వృద్ధిశాఖ మంత్రి సీతక్క.. ఈ ఇద్దరు పంచాయతీ కార్శదర్శులను సస్పెండ్ చేయాలని..ఆ శాఖ డైరెక్టర్ సృజనను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం భీమారం గ్రామ కార్యదర్శి అనిల్ కుమార్, ఆమనగల్ మండలం సింగంపల్లి కార్యదర్శి జంగయ్యలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 40 మందిపై అభియోగాలు రావడంతో వారి సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.
కొందరు విధులకు హాజరు కాకుండానే..ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా కొందరు పంచాయతీ కార్యదర్శులు ఏవేవో ఫొటోలు పెట్టి తప్పుడు అటెం డెన్స్ నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శుల హాజరీని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించే యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వారు విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే హాజరు నమోదు చేసుకోవాలి. దీన్ని రోజువారీగా సమీక్షిస్తుంటారు. అయితే కొందరు రోజూ ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో అనేక అంశాలు వెలుగుచూశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.