Half-day schools: స్క్పిల్లలకు శుభవార్త.. ఒంటిపూట బడులు అప్పటి నుంచే..!

Half-day schools announcement పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలకు ముందుగానే ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు పిల్లలకు శుభవార్త కూడా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Mar 6, 2025, 11:03 AM IST
Half-day schools: స్క్పిల్లలకు శుభవార్త.. ఒంటిపూట బడులు అప్పటి నుంచే..!

School timings change
తాజాగా పిల్లలకి శుభవార్త చెబుతూ ప్రభుత్వాలు ఒంటి పూట బడులు అమలు చేసే తేదీని ప్రకటించాయి.  మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్లు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

Add Zee News as a Preferred Source

ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. ఏప్రిల్ 23 వరకు ఇదే సమయంలో పాఠశాల ఉంటుందని,  టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రమే మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహిస్తారని విద్యాశాఖ వెల్లడించింది.

ఇక పదవ తరగతి కారణంగా ఎగ్జామ్స్ సెంటర్స్ గా ఉన్న పాఠశాలలకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతి గదులు జరగనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఎండ తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పెరిగిపోయింది.  అక్కడక్కడ 37 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి .

ఈ నేపథ్యంలోనే పిల్లలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమలు చేస్తుండడం పై పిల్లల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  అందులో భాగంగానే ఉష్ణోగ్రతలు అధికమైతే ఎండ తీవ్రతను పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తేదీలను కూడా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని ప్రభుత్వ , ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ ఇదే రూల్ ఫాలో కావాలని కూడా స్పష్టం చేయడం గమనార్హం.

READ ALSO: మైండ్‌బ్లోయింగ్‌ ఎయిర్‌టెల్‌ 77 రోజుల ప్లాన్‌.. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News