Bandi Sanjay Kumar: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తారని అనుకుంటే ఏమీ లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని విమర్శించారు. 'మాది ఇండియా టీం. కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్' అని అభివర్ణించారు. 27న జరిగే మ్యాచ్‌లోనూ కాంగ్రెస్ టీంను చిత్తుగా ఓడిస్తామని ఎమ్మెల్సీ ఎన్నికలను ఉటంకిస్తూ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Holiday: గుడ్‌న్యూస్.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు
'14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా?' అని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేస్తారని యువత ఆశించి నిరాశపడిందని తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలోనూ ఎప్పటి నుంచో దూదేకులం వంటి కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. తాము ఏనాడూ అభ్యంతర పెట్టలేదని చెప్పారు.
Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల
'12.5 శాతం ముస్లిం జనాభాలో 10.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపితే బీసీల పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీ పాలనలోనే ఫోన్ ట్యాపింగ్ దొంగలు విదేశాలకు పారిపోయింది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. సీబీఐ విచారణ కోరితే హైకోర్టు ముందే మీ అడ్వోకేట్ జనరల్ ఒప్పుకోని మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణ కోరితే దోషులందరి సంగతి తేలుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికిచ్చి 3 నెలలైనా చర్యలేవి? అని కేంద్రమంత్రి బండి సంజయ్ నిలదీశారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మీకు లేదా? అని సవాల్ చేశారు. వెనుకబాటు ఆధారంగా నిధుల పంపిణీ ఉంటుందనే సోయి లేదా రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటారా? అని రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఉద్యోగాల కల్పన, నిధుల ఖర్చుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. సవాల్ విసిరితే సీఎం తోకముడిచారని ఎద్దేవా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









