Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల!

Govt Employees Jackpot Pending Bills Will Be Clear Soon: బకాయి పడిన బిల్లులతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. త్వరలోనే పెండింగ్‌ బిల్లులకు మోక్షం లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 4, 2025, 05:06 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల!

Employees Pending Bills: కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు కదలడం లేదు. బిల్లులు సకాలంలో రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులతోపాటు డియర్‌నెస్‌ అలవెన్స్‌, పీఆర్‌సీ, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర కొంత కాలంగా ప్రభుత్వం వద్ద పేరుకుపోయాయి. వాటి కోసం ఉద్యోగులు విన్నవిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. తాజాగా ఉప ముఖ్యమంత్రితో సమావేశం కాగా వాటిలో కదలిక వచ్చేట్టు కనిపిస్తోంది. ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క పెండింగ్‌ బిల్లుల విడుదలకు సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే బిల్లులు వస్తాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆశలో ఉన్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Heavy Rains: తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభించే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో లచ్చిరెడ్డితోపాటు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ పాక తదితరులతో కూడిన ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసింది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు.. పెండింగ్‌ బిల్లులు వివరించారు.

Also Read: Charminar: భారీ వర్షానికి కూలిన చార్మినార్‌ పెచ్చులు.. తప్పిన భారీ ప్రమాదం

అనంతరం విలేకరుల సమావేశంలో లచ్చిరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ చేయాలని విన్నవించినట్లు చెప్పారు. ఉద్యోగుల జేఏసీ వినతులపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీనిచ్చినట్లు లచ్చిరెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సీఎం ను కలిసిన వారిలో తదితరులు ఉన్నారు.

హామీ నిలబెట్టుకుంటారా?
ఈ బిల్లులు విడుదలయితే ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతోపాటు పీఆర్‌సీపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేనట్టు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌ తెలంగాణలో ఉన్నాయి. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సర్దుకోవాలని.. అప్పులు పుట్టడం లేదని వ్యాఖ్యానించడంతో తమ ప్రయోజనాలు దక్కుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ వాస్తవం అవుతుందో.. లేకుంటే కాలయాపన కోసం ఈ ప్రకటన చేశారోనని ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News