Telangana Budget 2025-26: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నారు. కరువు భత్యం పెంపుతోపాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు, వేతనాల పెంపు, బకాయిలు వంటి వాటి కోసం ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Revanth Reddy: 'శుభాకాంక్షలు నాకు వద్దు.. రాహుల్ గాంధీకి చెప్పండి'
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 రేపు బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు. ఈ బడ్జెట్‌లో తమకు ఏదైనా కానుకలు ఏవైనా ఉంటాయేమోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనట్టు కరువు భత్యం బకాయిల్లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు కీలక అంశంగా ఉన్న డీఏ బకాయిలు విడుదల చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
Also Read: BRS Party Padayatra: గొంతెండుతున్న గోదావరి.. కేసీఆర్ ఇంటికి బీఆర్‌ఎస్ పార్టీ పాదయాత్ర
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. ఒకటో తారీఖున జీతం ఆర్భాటంగా ప్రకటించినా మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రత్యేక కానుకలు కాదు కదా ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకటో తారీఖు జీతాలు అందకపోగా సమయానికి అందాల్సిన ప్రయోజనాలు ఉద్యోగులకు లభించడం లేదు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు లభించడం లేదు. ఈ కారణంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 68 ఏళ్లకు పెంచే యోచన ప్రభుత్వం చేస్తుందనే ప్రచారం ఉద్యోగ వర్గాలను కలవరపరుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సభల్లో రేవంత్ రెడ్డి ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఆశించవద్దని.. సర్దుకుపోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశ చావడం లేదు. బడ్జెట్‌లో ఏదో ఒక ప్రకటన ఉంటుందని ఆశాభావంలో ఉన్నారు. మొత్తం ఐదు డీఏలు పెండింగ్ ఉండడంతో వాటిలో కనీసం రెండు ఇస్తుందనే ఆశల్లో ఉద్యోగులు ఉన్నారు. అయితే బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరి ఏముంటుందో రేపటి వరకు ఆగాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









