)
Komati Cheruvu: బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. వేల సంఖ్యలో పాల్గొనే మహిళల కోసం బతుకమ్మ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లు పరిశీలించారు. పర్యాటక శాఖ చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్ల అంశంపై ఉన్నతధికారులతో మాట్లాడారు.
భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలనీ పోలీస్ అధికారులకు మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. బతుకమ్మ పండగ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని.. మున్సిపల్, పోలీస్, టూరిజం శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సోమవారం జరగనున్న సద్దుల బతుకమ్మకు కోమటి చెరువు కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా పండగ ఏర్పాట్లు భారీగా ఉండాలని సూచించారు.
కోమటి చెరువుపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి.. టూరిజం శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు, సస్పెన్షన్ బ్రిడ్స్‌కు లైట్స్ ఏర్పాటు చేయకపోవడం, గ్లో గార్డెన్లో సరైన సౌకర్యాలు లేకపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నత అధికారులతో ఫోన్లో వారికి ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. కోమటి చెరువుపై భారీగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. అన్ని ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. గతం లో మాదిరిగానే పటిష్ట బందోబస్తూ చేయాలని సిద్దిపేట ఏసీపీని ఫోన్లో చెప్పారు. భద్రత ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని సూచించారు. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, టూరిజం అధికారులు సమన్వయం తో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook