Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల

MHSRB Telangana Announces Dental Assistant Surgeon And Speech Pathologist Vacancies Here Full Details:  నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజాగా రెండు ప్రకటనలు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 27, 2025, 12:31 AM IST
Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల

MHSRB Telangana Jobs: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. జాబ్‌ క్యాలెండర్‌ పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేయగా నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగ ప్రకటనల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. కీలకమైన శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగాలు ఏమిటి? వాటి అర్హతలు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన గురువారం సాయంత్రం విడుదల చేసింది. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12వ తేదీ నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ పథకం మరో ఏడాది పొడిగింపు

పూర్తి వివరాలు
ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో https://mhsrb.telangana.gov.in/MHSRB/home.html అందుబాటులో ఉంచారు. 

Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

త్వరలో మరో 6 వేల పోస్టులు
ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకు పైగా పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. వీరిలో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్న విషయం తెలిసిందే. మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు ప్రక్రియ శరవేగంగా చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News