)
Kusumanchi Officers: ప్రభుత్వ అధికారుల పనితీరుపై నిత్యం ఆరోపణలు, విమర్శలు ఉంటాయి. కానీ ఉద్యోగ వర్గాలు మాత్రం తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఉద్యోగులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారి గొప్ప పనితీరుకు అద్దం పట్టేలా.. వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన నిరూపిస్తోంది. తమకు పుట్టిన పాప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. వారికి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇంతటి దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారుల నిర్లక్ష్యంగా బతికుండగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూనుమంది తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్ అధికారి సరిదిద్దుకోకపోగా.. తమనే దబాయించి మందలించాడని ఆ కుటుంబం వాపోయింది. బతికున్న కూతురుకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన సంఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, మమత దంపతులు వారికి కొన్ని నెలల కిందట పాప జన్మించింది. పాప జనన సర్టిఫికెట్ కోసం పుట్టిన ఆరునెలల తర్వాత దరఖాస్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు లేకపోవడంతో కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి చెప్పారు. దీంతో బాలిక తల్లితండ్రులు గతేడాది డిసెంబర్ 17వ తేదీన జనన ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
అప్పటినుంచి అవి జతపర్చిన ధృవీకరణ పత్రాలు సరిగా లేవంటూ కాలాయాపన చేశారు. ఈ సమయంలో ఆగస్టు 4వ తేదీన బర్త్ సర్టిఫికెట్ కాకుండా డెత్ సర్టిఫికెట్ అందించారు. ఇది చూసి బాలిక తల్లిదండ్రులు విస్తుపోయారు. ఇదేమిటని ప్రశ్నించడంతో వెంటనే సెక్షన్ ఆఫీసర్ తీసుకుని దానిని చింపివేశారు. డెత్ బదులు మరల బర్త్ సర్టిఫికెట్ అందించారు. అయితే ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ కూడా తప్పుల తడకగా ఉంది. అందులో ఎక్కడ పుట్టిందనే వివరాలు లేకపోవడంతో.. వాటిని అడగ్గా అధికారి వారితో దుర్భాషలాడాడు.
కూసుమంచిలో తహసీల్దార్‌ను కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేడు. ఈ అంశంపై మీడియా తహసీల్దార్ రవికుమార్‌ను వివరణ కోరగా.. తాను కార్యాలయానికి రాలేదని, కోర్టు పనిమీద హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. బాలిక తల్లితండ్రులు ఫోన్లో జరిగిన విషయం తన దృష్టికి తీసుకవచ్చారని వెల్లడించారు. పొరపాటు జరిగితే సరి చేసి బర్త్ సర్టిఫికెట్ తిరిగి జారీ చేస్తామని కూసుమంచి తహసీల్దార్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.