
Wedding Tragedy: మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా.. యువతి మెడలో పసుపు తాడు కట్టాల్సినోడు ఉరితాడు బిగించుకున్నాడు. పెళ్లికి కొన్ని నిమిషాల ముందు అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫొటో షూట్ కోసం కాబోయే భార్యతో వచ్చిన వరుడు ఏం జరిగిందో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో వధువు నిర్ఘాంతపోయింది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డబ్బు మోగింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరింది. మాటాముచ్చట అయిపోయిన తర్వాత వారం రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. మార్చి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి పత్రికలు అచ్చు వేయించి.. భోజనాలకు ఏర్పాట్లు చేసి అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో కాబోయే వధూవరులు ఇద్దరూ ఫొటోషూట్ కోసం వెళ్లారు. అక్కడ వరుడు కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇద్దరూ ఫొటోషూట్‌కు కూడా వెళ్లారు. అప్పటివరకు అంతా బాగానే ఉన్నా రెండు రోజుల్లో పెళ్లికి బంధుమిత్రులు, కుటుంబసభ్యులు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వరుడు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులతోపాటు వధువు నిర్ఘాంతపోయింది. తన ఇంటిలో రాత్రి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. రేపు ఉదయం పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియకపోవడంతో గ్రామం మొత్తం సంచలనం రేపుతోంది. కిరణ్ ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.