Harish Rao: 'బసవేశ్వరుడి జయంతి రోజు రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయం'

Harish Rao Condemns Revanth Reddy Hate Speech: బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం రేవంత్‌ రెడ్డి వాడుకున్నాడని.. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏది ఉండదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దిగజారాడంటూ ధ్వజమెత్తారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2025, 08:35 PM IST
Harish Rao: 'బసవేశ్వరుడి జయంతి రోజు రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయం'

Revanth Reddy Hate Speech: బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడని.. విద్యార్థుల ముందు సోయి లేకుండా మాట్లాడుతున్నాడని రేవంత్‌ రెడ్డిపై బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ సమాజ స్థాపన కోసం, జాతి, కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. మహనీయుడి జయంతి రోజు రేవంత్‌ రెడ్డి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడాడని మండిపడ్డారు.

Add Zee News as a Preferred Source

Also Read: Revanth Reddy: 'నా పేరు తీసుకునే ధైర్యం లేదు'.. కేసీఆర్‌ సభపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బసవేశ్వర జయంతి రోజు రేవంత్‌ రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా హరీశ్ రావు స్పందిస్తూ మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి తీరును ఖండించారు. 'పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నాడు. రెండు సార్లు ఫలితాల విడుదల సమయం మార్చివేశాడు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడి రేవంత్‌ రెడ్డి సీఎం స్థాయిని, హోదాను దిగజార్చాడు' అని తప్పుబట్టారు.

Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్‌ ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్

'అచ్చోసిన ఆంబోతు అంటడు, సమాధి అంటడు కనీసం సోయి లేకుండా మాట్లాడాడు. ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్ రెడ్డి, నువ్వా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడా ఉండడని తెలిపారు. 'రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదు కళ్లలో.. కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నాడు. కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక ఈరోజు బయట కక్కిండు' అని హరీశ్ రావు చెప్పారు.

'కేసీఆర్‌పై అవే చిల్లర మాటలు మాట్లాడి కుక్క తోక వంకరే అని మరోసారి రేవంత్‌ రెడ్డి రుజువు చేశాడు. కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఉద్యమం చేసి రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కేసీఆర్ కల్పించాడు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. కేంద్రం మెడలు వంచి కేసీఆర్‌ తెలంగాణ సాధించాడని ప్రకటించారు. అది ఇచ్చినోళ్ల గొప్పతనమా, సాధించినోళ్ల గొప్పతనమా? అని ప్రశ్నించారు.

'సిగ్గులేకుండా ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని రేవంత్‌ రెడ్డి అంటుండు. కేసీఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, రెండు నెలల పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగలేదా' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు ప్రశ్నలు సంధించారు. మీ  15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా? అని నిలదీశారు. 

'పదేళ్లు అధికారంలో ఉంటానని రేవంత్‌ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. ఉన్న మూడేళ్లు నీ కుర్చి సక్కగా ఉండేలా చూసుకో' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు సూచించారు. ఏ పక్క నుంచి ఎవరు వచ్చి లాక్కుంటరో చూసుకో నువ్వు ఎంత మేకపోతు గాంభీర్యం చూపినా, కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అన్నది రోజుకోసారి నిరూపితమవుతున్నదని స్పష్టం చేశారు. 'అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదు. అతి తక్కువ కాలంలో అన్ని వర్గాల ప్రజలతో తిట్లు తింటున్న ఏకైక వ్యక్తి రేవంత్‌ రెడ్డి' అని హరీశ్ రావు ప్రకటించారు. 'శిశుపాలుడి లెక్క తప్పు మీద తప్పు చేస్తున్న రేవంత్‌ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News