)
Telangana Vote Politics: నవంబర్ 29 2009 చరిత్ర మలుపు తిప్పిన రోజు.. చారిత్రాత్మక రోజు. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది? తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయింది.. సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చాయి. సిద్దిపేటకు రైలు వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారం గా తెలంగాణ మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో పాల్గొని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు. 'డిసెంబర్ 9వ రోజు అమరుల కుటుంబాలను కూడా సన్మానం చేసుకుందాం. ఆ కుటుంబాలను గౌరవించుకుందాం. మీ మీ మండలాల్లో ఎవరైనా ఉంటే ఎల్లుండి తీసుకొని రండి. మంచిగా వారిని గౌరవించుకుందాం' అని తెలిపారు.
'ఎంత వీలైతే అంత మందిని రమ్మని చెప్పండి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులను తీసుకొని రండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిపాదన పెడుతున్న.. నవంబర్ 29 న పొద్దునే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అకౌంట్లలో డిసెంబర్ 9 వరకు రోజు ఒకటి పోస్ట్ చేయండి. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పది ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
'ప్రాణాన్ని పణంగా పెట్టీ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడు తెలంగాణను మోసం చేస్తాడా? కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను కేసీఆర్ నిజం చేశాడు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి రేవంత్ గద్దెనెక్కాడు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద శ్రద్ధ లేదు. 42 శాతం రిజర్వేషన్లు అని బీసీలను మోసం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు ఈ కాంగ్రెస్ నాయకులకు పోలిక లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తారు మరి మలన్నసాగర్ లో కొండపోచమ్మలో నీళ్లు ఎళెక్కడివి? ఎక్కడ కాలువలు తవ్వి నీళ్లు ఇస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఆ పని ఆపేశారు. అలాంటి రాజకీయాల కోసం చూసే కాంగ్రెస్ నాయకులకు మనకు పొంతన లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook