Harish Rao Chit Chat: తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం గురు దక్షిణగా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మళ్లీ ప్రాజెక్టులను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
Also Read: Kannappa Movie Trailer: అద్దిరిపోయిన కన్నప్ప ట్రైలర్.. ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా?
హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో కాళేశ్వరంలో ఉన్న అన్ని విభాగాల వద్దకి వెళ్లి ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తాం.. మీడియాతో కలిసి కాళేశ్వరం సందర్శిస్తాం' అని ప్రకటించారు. గోదావరి పరివాహక రైతులు, ప్రజలతో కలిసి తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం' అని ఎమ్మెల్యే హరీశ్ రావు వెల్లడించారు.
Also Read: WTC Prize Money: దక్షిణాఫ్రికాకు డబుల్ జాక్‌పాట్.. భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం చేసిన అప్పులపై త్వరలో మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని బయటపెడుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన బయటపెట్టగానే.. నిమిషాల వ్యవధిలో నేను మరికొన్ని డాక్యుమెంట్లు బయటపెడుతా' బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు తెలిపారు.
గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నదిలేని చోట అంత పెద్ద రిజర్వాయర్ అవసరమా అన్నారు.. ఇవాళ ఏపీలోని గొల్లపల్లి వద్ద 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం కడుతున్నారు. pic.twitter.com/ePWbRL3PmU
— Veerla (@MeetVeerla) June 14, 2025
'బనకచర్లపై ప్రాజెక్టుపై బీజేపీ మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 'అపెక్స్ కౌన్సిల్స్‌కి సంబంధించి నిర్ణయం తీసుకునేది సీఎం కాబట్టి నా లక్ష్యం రేవంత్ రెడ్డి' అని తెలిపారు. గురు దక్షిణగా చంద్రబాబుకు, బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడటం లేదు. తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడితే రేవంత్ తెలంగాణలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









