)
Kaleshwaram Project: తెలంగాణకు జీవ ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు తిప్పికొట్టారు. నిరాధార, కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ తీరుపై గర్జించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన సీపీ ఘోష్ కమిషన్ ఏర్పాటు తప్పు అని తెలిపారు. కమిషన్ ఏర్పాటు తప్పయిన సమయంలో ఇక ఆ కమిటీ నివేదిక ఇంకా ఎందుకు అని ప్రశ్నించారు. సీపీ ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన సీపీ ఘోష్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. సీపీ ఘోష్ కమిషన్ డ్రామా.. ఇది మొత్తం ప్రభుత్వం ఆడిస్తున్న సర్కస్ అని విమర్శించారు. హరీశ్ రావు పూర్తి ప్రసంగం ఇలా ఉంది.
• కోర్టుకు ఇందిరా గాంధీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు వెళ్లారు
• సహజ న్యాయ సూత్రాలు పాటించ లేదని, నిబంధనలు పాటించలేదని కోర్టుకు వెళ్లారు.
• మేము మా హక్కుల కోసం కోర్టుకు వెళ్లాం.
• అసెంబ్లీలో చర్చ చేయవద్దని మేం కోర్టుకు పోలేదు, రిపోర్టును ట్రాష్ చేయాలని మాత్రమే కోర్టుకు వెళ్లాం.
• మాట మార్చుడు కోమటి రెడ్డికి ఉంటది తప్ప నాకు కాదు.
• కేసీఆర్ గారు నాడు కాళేశ్వరం మీద పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే ఇదే కోమటి రెడ్డి మా ఉత్తమ్ ప్రిపేర్ కాకుండా పోయిండు అన్నడు.
• కమిషన్ రిపోర్టు కోర్టు ముందు నిలబడదు
• ఇది డొల్ల రిపోర్టు, చెత్త రిపోర్టు.
• తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలు లభ్యత లేదని కేంద్ర జలసంఘం 18.02.2015 న చెప్పింది.
• తెలంగాణ వచ్చాక తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం.
• మహారాష్ట్ర నీళ్ల మంత్రిను కలిసి అడిగినం.
• ఆ తర్వాత బిజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో వస్తే ఆ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు
• అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారి సమక్షంలో కేసీఆర్ మహారాష్ట్ర సీఎంను కలిసి విజ్నప్తి చేశారు. అయినా ఒప్పుకోని పరిస్థితి.
• మసిబూసి మారేడు కాయ చేయడంలో రేవంత్ రెడ్డి సిద్దహస్తుడు
• సీఎం గారు చదివిన అదే ఉమా భారతి గారు లెటర్ లో మూడో పేజీలో ఏముంది
• నీటి లభ్యత లేదని క్లియర్ గా ఉంది.
• రేవంత్ రెడ్డి లాగే మొదటి పేజీ చదివారు తప్ప, మూడో పేజీ చదవలేదు కమీషన్
• అందుకే తప్పుడు రిపోర్టు ఇచ్చింది
• 2004 వరకే నీటి సీరిస్ పంపారు, 2013 వరకు పంపాలని సీడబ్ల్యూసీ మాకు లెటర్ రాసింది.
• మేము అప్ డేటెడ్ సీరిస్ పంపాము.
• ఘోష్ గారికి అన్ని వివరాలు పంపాము. వారికి డౌట్ వస్తే సిడబ్లుసిని అడగాలి కదా.
• 165లో 63 టీఎంసీల పై రాష్ట్రాల వాటా నీళ్లు ఉన్నాయి. అవి పోతే ఉండేది 102 టీఎంసీలే. భవిష్యత్తులో నీళ్లు ఉండవు అని 4.3.2015లో సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ గా చెప్పింది.
• ఇదే విషయాన్ని మూడు ఉత్తరాల్లో చెప్పింది.
• మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. నాటి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో కూడా నీళ్లు లేని చోట ప్రాజెక్టు కడితే ఆ ఖర్చు వృథా అవుతుందని చెప్పారు.
• సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు పొంగులేటి కేసీఆర్ గారి పక్కనే ఉన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.
• ప్రాణహితను కట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేసాం, ప్రాజెక్టును కొనసాగించే ప్రయత్నం చేసినం.
• నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉండటం ఇలాంటి అనేక కారణాలతో తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు ముందుకు పోలేదు.
• ప్రాణహిత కోసం పెట్టిన 11వేల కోట్లను ఆదా చేసే ప్రయత్నం చేసినం. నీళ్లు లేని చోట నుంచి ఉన్న చోటకు మార్చినం.
• 2009 నుంచి 14 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉండి తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు.
• వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్
• చర్చ జరగాలని అడుగుతున్నా. రాత్రి 2 గంటలైనా ఉంటా, మైకు కట్ చేయొద్దు.
• అప్పుడు తమ్మిడిహట్టి పూర్తి చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్న ఎందుకు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు.
• తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎట్ల పెరుగది అన్నరు.
• ఒకటి గుర్తు చేయదలుచుకున్నా మేడిగడ్డకు మార్చుతూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆనాడు జూపల్లి కూడా భాగమే.
• తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు.
• మొత్తంగా మేడిగడ్డ దగ్గర 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది.
• మా సూచన మేరకే అన్నారం, సుందిళ్ల కట్టి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీరు తేవడం జరిగిందని రిటైర్డ్ ఇంజినీర్లు కమిషన్ కు స్పష్టంగా చెప్పారు
• కమీషన్ ఎందుకు రిటైర్డ్ ఇంజినీర్ల రిపోర్టును ఎందుకు పట్టించుకోవడం లేదు.
• ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పు, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్మాణం అంతా రిటైర్డ్ ఇంజినీర్లు సూచించింది.
• రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ రిపోర్టు కావాలని ఘోష్ కమిషన్ కు లేఖ రాసి అడిగితే, నాకు కమీషన్ పంపింది.
• ఇదే విషయాన్ని కమిషన్ తన రిపోర్టులో కూడా పేర్కొంది.
• రిటైర్డ్ ఇంజినీర్ల మొదటి రెండో రిపోర్టులు పంపుతా. అందులో ఏం ఉందో చదువుకోండి ఉత్తం గారు
• ప్రాజెక్టుల స్థల మార్పు, ప్రాజెక్టుల నిర్మాణం సొంత నిర్ణయం అనే తప్పుడు ప్రచారం మానుకోండి.
• కమీషన్ నన్ను అడిగిన ప్రశ్నలోనే సమాధానం చెప్పిన
• మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు నేరుగా సాధ్యం కాదని చెప్పిన.
• రిటైర్డ్ ఇంజినీర్ల సూచన కూడా పాటించాం, ఇదే విషయాన్ని ఘోష్ కమీషన్‌కు రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు.
• కాని ఈ వాస్తవాలను ఘోష్ కమిషన్ విస్మరించింది. అందుకే ఈ కమిటీని పీసీసీ కమిషన్ అంటున్నాం.
• డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా అంటున్నారు.. ప్రాణహితకు డీపీఆర్ 2009లో వస్తే, 28 ప్యాకేజీలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చింది మీరు.
• నారాయణ పేట లిఫ్టు ఇరిగేషన్ కు డీపీఆర్ లేకుండా టెండర్లు పిలిచింది మీరే కదా
• జలయజ్నంలో అనేక ప్రాజెక్టులకు ఇదే పరిస్థితి.
• ఎన్నో ప్రాజెక్టులకు డీపీఆర్ లేకుండానే టెండర్లు పిలిచారు.
• కాళేశ్వరం డీపీఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఇచ్చినం.
• ఉత్తం గారు ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడుతూ..
• దే ఆర్ మాస్టర్స్, ఎక్స్ పర్ట్స్ ప్రపంచంలోనే వాళ్లంత తెలివితేటలు ఎవరికి ఉండవు అన్నరు.
• మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్ క్వాలిఫైడ్ అన్నరు. ఇంకా చాలా అన్నరు.
• కానీ ఇదే ఉత్తం గారు పార్లమెంట్ లో ఎన్డీఎస్ఏ బిల్లును వ్యతిరేకించారు.
• ఇప్పుడు సుద్దులు చెబుతున్నడు.
• పార్లమెంట్ ద్వారా ఎన్డీఎస్ఏ చట్టం అన్నరు. మరి దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా
• ఇదే గోదావరి నదిపై కట్టిన పోలవరం 10 సార్లు కూలింది. ఎందుకు ఒక్క సారి కూడా ఎన్డీఎస్ఏ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు
• నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుందా
• పోలవరం 10 సార్లు కూలితే రిపేర్లు చేయాలంటే 7వేల కోట్ల దాకా కావాలి.
• ఎన్డీఎస్ఏ చైర్మన్ గా, పోలవరం ప్రాజెక్టు సీఈవో గ చంద్రశేఖర్ అయ్యర్ ఉన్న సమయంలోనే పోలవరం 5 సార్లు కూలింది.
• ఇగ ఆయన చైర్మన్ గా ఉన్న ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్టు ఇస్తదట, ఆ ఆయన తీస్ మార్ ఖాన్ అంట.
• అలాంటి రిపోర్టుకు ఏం సాంటిటి ఉంటది.
• ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలింది. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్డీఎస్ఏ రాదు, కమీషన్లు వేయరు.
• అన్నారం, సుందిళ్ల బ్రహ్మాండంగా ఉన్నాయని మండలిలో కోదండరాం అడిగిన ప్రశ్నకు ఇదే ఉత్తం గారు సమాధానం చెప్పారు.
• ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో స్పష్టం చెప్పింది. ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్ లోకి తేవాలి అని. దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కాళేశ్వరం అంటే.. 3 బ్యారేజీలు • 225 గేట్లు • 228 పిల్లర్లు • 15 రిజర్వవయర్లు • 19 సబ్ స్టేషన్లు • 21 పంప్ హౌజులు • 203 కిలోమీటరు సొరంగాలు • 1531 కిలోమీటరు గ్రావిటీ కెనాల్స్ • 98 కిలోమీటరు ప్రెజర్ మెయిన్స్ • 141 టిఎంసీల్ స్టే రేజ్ కెపాసిటీ • 530 మీటరు ఎత్తుకు లిఫ్ట్, • 240 టిఎంసీల్ నీటి వినియోగం • ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం..మేడిగడ్డలోని ఏడో బ్లాకులోని రెండు పిల్లర్లు కుంగటం తప్పా ఈ వ్యవస్థ అంతా అద్భుతంగా ఉంది.
ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా 3, 4 వందల కోట్ల ఖర్చు మాత్రమే అవుతుంది.
అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్దాంతం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.