BRS Party Silver Jubilee Celebrations: తమకు దిష్టి తగలడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సాధించిన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా కేసీఆర్ నిలిపారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై పసిపిల్లల నుంచి పండుముసలి వరకు.. చివరికి మూగ జీవాలు కూడా క్షమించలేని పరిస్థితి అని వివరించారు. పాలనలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల!
ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా శుక్రవారం సిద్ధిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో హరీశ్ రావు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. 'సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది. పార్టీ పెట్టి లక్ష్యం (తెలంగాణ౦) సాధించి.. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపినది బీఆర్‌ఎస్ పార్టీ' అని వివరించారు. 2001లో సిద్దిపేట కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం.. సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకుని కేసీఆర్ గులాబీ జెండా ఎగరేశారని గుర్తుచేసుకున్నారు.
Also Read: Charminar: భారీ వర్షానికి కూలిన చార్మినార్ పెచ్చులు.. తప్పిన భారీ ప్రమాదం
25 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు ఒక పండగగా జరగాలని.. ఆరోజు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు ఘనంగా చేయాలని పార్టీ నాయకులకు మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట ప్రజలు ఇచ్చిన బలంతో కాంగ్రెస్ పార్టీ హామీలపై పోరాడుతున్నట్లు తెలిపారు. మనకు దిష్టి తగలడంతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన ఆగమాగం.. సగం సగం అని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
'సిద్దిపేటకు రైలు అనేది దశాబ్దాల కల సాకారమైంది. త్వరలో ఢిల్లీ, బెంగుళూరుకు రైలు నడపనున్నట్లు' మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. భూముల రేట్లు పడిపోవడంతో బ్యాంకుల్లో కూడా డిపాజిట్స్ తగ్గిపోయాయని తెలిపారు. 'కాంగ్రెస్ ఇచ్చిన రూ.4 వేల పింఛన్ ఇవ్వలేదు, రుణమాఫీ సగమే చేశారు. రైతు బంధు ఎగొట్టారు' అని వివరించారు. మళ్లీ తప్పకుండా సిద్ధిపేటకు పూర్వ వైభవం వస్తుందని ప్రకటించారు. అనంతరం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే హరీశ్ పంపిణీ చేశారు. అంతకుముందు చిన్నకోడూర్ మండలంలో జరిగిన వాలీబాల్ టోర్నీ విజేతలకు బహుమతులను అందజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









