Global Summit Utter Flop: పెట్టుబడుల కట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదని.. దాన్ని చేరుకునే మిషన్ లేదని.. అది 'విజన్ లెస్' డాక్యుమెంట్ అని అభివర్ణించారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు అని మండిపడ్డారు.
గ్లోబల్ సదస్సుపై బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రశ్నలు, తీవ్ర ఆరోపణలు చేశారు. 'రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సవాల్ చేశారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు గారు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్‌లాగా లేదు. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటుచేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పొలాగా ఉంది' అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నదని చెప్పారు. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందని ప్రకటించారు.
Also Read: KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట
'విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు. విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు. ఆ డాక్యుమెంట్‌కు శాంటిటీ లేదు. అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల 'విజన్ లెస్' డాక్యుమెంట్ అది' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అని వర్ణించారు.
'గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టారు. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరు అన్నరు. ఒక్క ముఖ్యమంత్రి రాకపోగా.. 5 వేల మంది విదేశీ రిప్రెజంటేటివ్స్ రాలేదు. ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప. చివరకు ఏఐసీసీ నాయకులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి. గ్లోబల్ సమ్మిట్‌లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారని వివరించారు. గ్లోబల్ సమ్మిట్ కాదు అది లోకల్ సమ్మిట్ అని.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని.. అందమైన కట్టుకథ అల్లినవు రేవంత్ రెడ్డి బయోస్కోప్ సినిమా చూపించావు అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. భూములు, విద్యుత్, మద్యం కుంభకోణం అయిపోవడంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుంభకోణం మొదలుపెట్టారని రేవంత్ రెడ్డిపై మాజీ హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసమే కానీ పెట్టుబడుల కోసం కాదు అని అందరికీ అర్థం అయ్యింది' అని హరీశ్ రావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









