Telangana Bhavan: ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందనే పరిజ్ఞానం లేని అజ్ఞానీ రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు, ఎకిలి మాటల ముద్దుబిడ్డగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డికి బూతుల గురించి తెలిసినంతగా బేసిన్‌లా గురించి తెలియదని చెప్పారు. నీటి ప్రాజెక్టుల పై అవగాహన లేని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్ట్ ఏ బేసిన్‌లో ఉందో తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు.
Also Read: TGSRTC Price Hike: తెలంగాణ ప్రజలకు బిగ్‌షాక్.. ఆర్టీసీ టికెట్ల ధర భారీగా పెంపు
అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బుధవారం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'బేసిన్‌లా గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిక్ నాలెడ్జ్ మీద లేదు. ఇష్టం వచ్చినట్లు సొల్లు వాగుడు తప్పా.. సంస్కారం గురించి రేవంత్ రెడ్డికి తెలియదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు.
'భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భక్తిలా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి ఆదిత్యా నాథ్ దాస్ అనుసంధానంగా ఉన్నాడు. తెలంగాణకు గోదావరి నది నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 500 టీఎంసీ సరిపోతాయని ఎలా అంటాడు' అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు గోదావరి జలాలు వెయ్యి టీఎంసీలు సరిపోతాయని బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ఆరోపించారు.
Also Read: Harish Rao: 'బోడిగుండుకు మోకాలుకు లంకె పెట్టడంలో రేవంత్ రెడ్డి సిద్దహస్తుడు'
'తెలంగాణకు గోదావరి జలాలు 960 టీఎంసీలతో పాటుగా 1950 టీఎంసీలు కావాలని ఆనాడే కేంద్ర జలవనరుల మంత్రికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. నీటి జలాలపై కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డికి లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర హక్కులు చంద్రబాబుకు రాసి ఇస్తానంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అని హెచ్చరించారు. 'చంద్రబాబు అడుగులకు రేవంత్ రెడ్డి మడుగులు ఒత్తుతున్నారు. బానిస బతుకులకు రేవంత్ రెడ్డి దాసోహం అవుతున్నాడు. రేవంత్ రెడ్డి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మండిపడ్డారు. గోదావరి, కృష్ణా విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook