Paddy Procurement: అన్నింట్లో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలులో కూడా విఫలమైనట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. భారీ ధర పలకాల్సిన వరి ధాన్యానికి నామమాత్రపు ధర దక్కుతోందని తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని చెప్పారు.
Also Read: Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు విక్రయిస్తున్న పరిస్థితి అని తెలిపారు. క్వింటాలుకి రూ.2,320 మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు రూ.రెండు వేలు, రూ.2,100కే విక్రయిస్తున్నారని వివరించారు.
Also Read: Sabitha Reddy: భర్తను తలచుకుని భావోద్వేగానికి లోనయిన మాజీ మంత్రి సబితా రెడ్డి
అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకి అమ్ముకునే దుస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వానాకాలంలో మొత్తం లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించారని గుర్తుచేశారు. మిగతా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటకు వదిలేశారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే కొనుగోలు చేశారని.. రెండొంతుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.
యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని.. ఇది రైతు కంటక ప్రభుత్వం అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి చేయలేదని గుర్తుచేశారు. రైతు బంధును వానకాలంలో ఎగ్గొట్టి యాసంగిలో రెండు మూడు ఎకరాలకే ఇచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, గాలి దుమారంతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.20 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశార. తక్షణమే కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకొని రైతులను ఆదుకోవాలని కోరారు.
'ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల్లో రైతులకు డబ్బులను బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని హైదరాబాద్‌లో చెప్తారు. కానీ గ్రామాల్లో అలాంటి పరిస్థితి లేదు. రైతులకు డబ్బులు అందడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అకాల వర్షాలు, రైతు బంధు, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









