)
Harish Rao Fires on Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని నారా లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల కట్టి తీరుతామంటే అర్ధం ఏంటి..? ఎవరి అండ చూసుకొని ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర నేతలు లొంగిపోవడం వల్లే.. సహకరించడం వల్లే ఈ దుస్టితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెలించే పరిస్థితి కనపడుతోందన్నారు. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎలా చెబితే అట్లా వింటోందన్నారు. మిగులు జలాలు వాడుకొంటే తప్పేంటి అంటున్నారని.. నీళ్లు ఉన్నది నిజమే అయితే DPR ఎందుకు తిప్పి పంపారని ప్రశ్నించారు. ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
"కాళేశ్వరం ప్రాజెక్టను అడ్డుకున్నామా.. అని నారా లోకేష్ అంటున్నారు. గతంలో అడ్డుకున్నది నిజమే.. మీ నాన్నను అడుగు. నాడు కాళేశ్వరం వ్యతిరేకిస్తూ 7 ఉత్తరాలు చంద్రబాబు రాశారు. ఇక్కడి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి.. ఏపీ ప్రాజెక్ట్‌లకు మేలు చేసుకోవాలని చూస్తున్నారు. జలద్రోహం చేయాలనుకుంటున్నారు. బనకచర్లను అడ్డుకొని తీరుతాం.. మీరు కట్టుకోవాలనుకుంటే కుదరదు. మా వాటా ఇస్తూ మీరు కట్టుకోండి. మేము కూడా కాళేశ్వరం టైమ్‌లో మహారాష్ట్రకు పదిసార్లు పోయినాం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన నీటి కేటాయింపులను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు..? నువ్వు ఎలా కడతావ్ బిడ్డా.. గతంలో మా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లెటర్స్‌ను వాపస్ తీసుకో.
మా హక్కులను తేల్చాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అంటాడు. మా ప్రజలకు మూగజీవులకు పంటలకు నీళ్లు వద్దా..? ఆనాడు మీ నాన్న బాబ్లీ లాంటి ప్రాజెక్ట్స్ వద్ద కొట్లాడితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్లు కాదా..? నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ నిర్ణయాన్ని మరి ఎందుకు రిజెక్ట్ చేశాయి..? మీరు కడితే మేము అవసరం అయితే సుప్రీం కోర్టుకు అయినా వెళతాం. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటే కేంద్రం దారికి వచ్చేవారు. ఎంపీ సీట్లు చెరి సగం గెలుచుకున్నవాళ్లు పార్లమెంట్‌ను స్తంభింప చేయాలి కదా.. నాడు కేసీఆర్ 65, 35 వాటా కోసం మీ ఇద్దరు సీఎంల కోరాడు వినలేదు." అని హరీష్ రావు అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook