Sangareddy Politics: 'రాష్ట్రమంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నదని.. ఏడాది పాలనలో ప్రజలకు పాలు ఏవో.. నీళ్లు ఏవో అర్థం అయిపోయింది. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అన్నది ప్రజలకు అర్థమైపోయింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక పోయినట్టు అయిందని రేవంత్ రెడ్డి పాలనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు. తులం బంగారం పూసే లేదు' అని ఆరోపించారు. 'కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు. రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు' అని చెప్పారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని.. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేదని గుర్తుచేశారు.
Also Read: Miss World 2025: తెలంగాణ కీర్తిని పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జీఎస్టీ వృద్ధిరేటు పడిపోయిందని హరీశ్ రావు లెక్కలు వివరించారు.
Also Read: K Kavitha: 'బీజేపీతో రేవంత్ రెడ్డి లాలూచీ.. అపాయింట్‌మెంట్ అడగకుండా డ్రామాలు'
'దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధించింది' అని హరీశ్ రావు లెక్కలు వివరించారు. 'కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి వాటిని నరుకుతున్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లని నరికేసిండు. నిన్న హెచ్‌సీయూ భూముల్లో 400 ఎకరాల అడవుల్లోనూ నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడు' అని విమర్శించారు. ఏం పాపం చేశాయని రేవంత్ రెడ్డి మూగజీవాల ఉసురు పోసుకుంటున్నావు అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
'హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ది సాగు భాష అయితే.. రేవంత్ రెడ్డిది చావు భాష' అని హరీశ్ రావు తెలిపారు. 'కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలి అనేది. ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందించాలని చెప్పేది. రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా చంపుతా తొడలదర కొడతా ఇలాంటి భాష రేవంత్ రెడ్డిది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.
'హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసులు పెడితే ఉప ముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటాడు అంట. ఇదేమి రాజ్యం. తోక కుక్క నాడిస్తున్నదా కుక్క తోక నాడిస్తున్నదా అర్థం కావడం లేదు' మాజీ మంత్రి హరీశ్ రావు సందేహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా అని పేర్కొన్నారు. అక్రమ కేసులు మోపినందుకు హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
'రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం. మూసీ మూసీ అన్నాడు మూడు నెల్లకే ఎల్లెలుకల పడ్డాడు. హైడ్రా హైడ్రా అని ఆరు నెలలు ఉరికిండు వెల్లకిలబడ్డాడు' అని తెలిపారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని గుర్తుచేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని.. కాంపౌండ్‌లో గిరాకీ లేదు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు.
కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి పాలనలో దిగుడే దిగుడు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఎట్లున్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడని ప్రశ్నించారు. దేశానికి నంబర్ వన్‌గా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని.. మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీ వరంగల్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12 శాతం జీఎస్టీ వృద్ధిరేటు ఉండేది.
దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జిఎస్టి వృద్ధిరేటు పడిపోయింది. దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే వృద్ధిరేటు సాధించింది.… pic.twitter.com/7m4HV9QDH3
— Veerla (@MeetVeerla) April 9, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









