HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని సహా పలువురి బర్తే డే విషెస్..

HBD Revanth Reddy: ఈ రోజు రేవంత్ రెడ్డి 55 యేళ్లు కంప్లీట్ చేసుకొని 56వ యేట అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయా నేతలు సహా సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 8, 2025, 11:12 AM IST
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని సహా పలువురి బర్తే డే విషెస్..

HBD Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా  శుభాకాంక్షలు చెబుతున్నారు.  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తెలంగాణ సీఎం కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ట్వీట్ చేశారు. అటు రేవంత్ రెడ్డి రాజకీయ గురువు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,  ఏపీ మంత్రి నారా లోకేష్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. అటు సినీ రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. అటు సినీ రంగం నుంచి గతంలో లాగా ఎవరు బర్త్ డే విషెస్ ఇప్పటి వరకు చెప్పలేదు. తర్వాత చెబుతారా అనేది చూడాలి. 

Add Zee News as a Preferred Source

అటు రేవంత్ మంత్రివర్గ సహచరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. రేవంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారా లేదా అనేది చూడాలి.  రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8 ఉమ్మడి పాలమూరు జిల్లాలో జన్మించారు. మహబూబ్ నగర్  వంగూరు మండలం కొండారెడ్డిపల్లి రేవంత్‌ రెడ్డి స్వగ్రామం.ఎనుముల రేవంత్‌ రెడ్డి కుటుంబం చాలా పెద్దది. రేవంత్‌కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రేవంత్ రెడ్డికి భార్య, కుమార్తె, అల్లుడు మనవడు రియాన్ష్‌ రెడ్డి ఉన్నారు. రేవంత్‌కు రాజకీయంగా, వ్యాపారపరంగా సోదరులు అండగా నిలుస్తుండడం విశేషం. తొలి దశలో రేవంత్‌ రెడ్డి పెయింటింగ్‌ పని చేశారని అక్కడి గ్రామస్తులు, అతడి సన్నిహితులు చెబుతున్నారు. అనంతరం వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి విజయవంతమయ్యారు.

ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన రేవంత్ రెడ్డి..  ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 'జాగృతి' అనే వార పత్రికలో పని చేశారు. ఆ క్రమంలో సంఘ్ పరివార్ తో  రేవంత్‌కు మంచి అనుబంధం ఉంది. తదనంతరం అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ (బీఆర్‌ఎస్‌)లో చేరి కార్యకర్తగా పని చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో రేవంత్‌ గులాబీ కార్యకర్తగా చురుగ్గా పాల్గొన్నారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుత మాజీమంత్రి హరీశ్ రావు వెంట రేవంత్‌ రెడ్డి తిరిగాడు. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీచేసిన రేవంత్‌ రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ ఓటు విషయంలో ఓటుకు నోటుకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో అరెస్ట్‌ కావడం రేవంత్‌ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఇప్పటికీ ఈ కేసులో కోర్టులో పెండింగ్ లో ఉంది. 

అదృష్టం వెన్నంటి ఉండి చిన్న వయసులో పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు.  దీంతో ఆయన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. దురుసు ప్రవర్తన, భాష అనేది రేవంత్‌ రెడ్డికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. అంతేకాదు దేశంపై ఎంత పడితే అంత విచక్షణ లేకుండా మాట్లాడటం  రేవంత్ లో  ఉన్న మైనస్ లు. 

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News