Heat Waves: ఉత్తర తెలంగాణ 'ఎండల' రికార్డు.. ఈ ఏడాది రికార్డు బద్దలు

Serious Heat Across North Telangana And Hyderabad: వేసవికాలంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వేసవి మధ్యలోకి రావడంతో సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 21, 2025, 10:16 PM IST
Heat Waves: ఉత్తర తెలంగాణ 'ఎండల' రికార్డు.. ఈ ఏడాది రికార్డు బద్దలు

Serious Heat In Telangana: వేసవికాలం తీవ్ర రూపం దాలుస్తోంది. పగటి పూటతోపాటు రాత్రిళ్లు కూడా వేడితో ప్రజలు ఉండలేకపోతున్నారు. పగలు రాత్రి వేడితో అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ భగభగమంటుండగా.. హైదరాబాద్‌లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. ఉత్తర  తెలంగాణలోని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో ఎండలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Add Zee News as a Preferred Source

Also Read: Tirumala: భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటే బెటర్‌

ఉత్తర తెలంగాణ భగభగ
ఈ ఏడాదిలో 44 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరాయి. సోమవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా అటవీ జిల్లా అయిన ఆదిలాబాద్‌లో 44 డిగ్రీలు నమోదవగా.. ఆసిఫాబాద్‌ 43.4, నిర్మల్‌ 43.8, మంచిర్యాల 43.7, జగిత్యాల 43.6, సిరిసిల్ల 43.5, పెద్దపల్లి 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆయా జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ ఎండల ధాటికి రైతులతోపాటు రోజువారీ కూలీలు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండల దెబ్బకు పగటి పూట బయటకు రాలేకపోతున్నారు.

Also Read: Lord Shiva: ఆలయంలో కళ్లు తెరిచిన శివుడి విగ్రహం.. అసలు రహాస్యమేమిటో తెలుసా?

ఆదిలాబాద్‌ 44
ఆసిఫాబాద్‌ 43.4
నిర్మల్‌ 43.8
మంచిర్యాల 43.7
జగిత్యాల 43.6
సిరిసిల్ల 43.5
పెద్దపల్లి 43.4

అత్యధికంగా హైదరాబాద్‌లో
ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే కొంత చల్లదనంతో ఉండే హైదరాబాద్‌లో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం భానుడు ప్రతాపం చూపాడు. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. బంజారాహిల్స్‌ ప్రాంతంలో 41.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదవగా.. ముషీరాబాద్‌ 41.6, గాజులరామారం 41.5, హబ్సిగూడ 41.5, చార్మినార్‌ 41.4, ఖైరతాబాద్‌ 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి.

అదే స్థాయిలో..
బంజారాహిల్స్‌ 41.6
ముషీరాబాద్‌ 41.6
గాజులరామారం 41.5
హబ్సిగూడ 41.5
చార్మినార్‌ 41.4
ఖైరతాబాద్‌ 41.4

అధిక ఉష్ణోగ్రతలతో తెలంగాణ వేడెక్కింది. ఉదయం నుంచే ఎండలు తీవ్ర రూపం దాలుస్తుండగా ఆ వేడి రాత్రయినా కూడా చల్లబడడం లేదు. పగలు, రాత్రీ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చుని ప్రజలు సేద తీరుతున్నారు. ఈ ఎండల ధాటికి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం లేదు. మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News