)
Basara Floods: బాసర ఆలయం దగ్గర గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. అంతేకాదు బాసర ఆలయం దరిదాపుల్లోకి వరద రావడంతో హుటాహుటిన బాసర వెళ్లిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల వరద పరిస్థితిని సమీక్షించారు. బాసర బ్రిడ్జికి అత్యంత దగ్గరగా కేవలం మూడు ఫీట్ల క్రింది నుంచి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదారమ్మ బ్యాక్ వాటర్‌తో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండిపోయి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదీ ప్రవాహం జలాలు రావడంతో బాసరతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వరద నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో 100 వరకు అతిథి గృహాలు, పలు గెస్ట్ హౌస్‌లు జలమయమయ్యాయి. SBI బ్యాంకు బ్రాంచ్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రైవేటు అతిథి గృహాలు పలు హోటళ్లు నీట మునిగాయి... బాసరలో వరద ప్రాంతాలను ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. వేకువజామునే బాసరలో వరద ప్రాంతాలను సందర్శించారు. అనంతరం వరద బాధితులతో పాటు వివిధ రకాల పంటలను నష్టపోయిన రైతులను అడిగి తెలుసుకున్నారు.
మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మంజీరా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఆలయాన్ని ముంచెత్తిన వరదతో 16 రోజులుగా ఆలయం మూతపడింది. రాజగోపురం వద్దే అమ్మవారి విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది. గర్భగుడిలో అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా పరవళ్లు తొక్కుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.