)
Telangana Heavy Floods: కృష్ణ పరివాహకంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఈ సీజన్లో మరోసారి వరద ఉధృతి పెరగడంతో మళ్లీ గేట్లు ఎత్తారు. అన్నీ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఈ సీజన్లో 26 గేట్లు తెరుచుకోవడం ఇది ఐదోసారి కావడం విశేషం. 5 లక్షలకు పైగా ఇన్‌ఫ్లో రావడం ఈ సీజన్లో తొలిసారి. భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అన్ని గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
16 గేట్లు 15 అడుగులు, 10 గేట్లు 20 అడుగుల మేర పైకి ఎత్తి స్పీల్ వే ద్వారా 5,74,782 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు 5,43,875 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అవుట్ ఫ్లో 6,24,014 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 584.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 295 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
గోదావరి పరుగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రమాదకరస్థాయిలో గోదావరి నది ప్రవహిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే 13.110 మీటర్ల ఎత్తులోప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పుష్కర ఘాట్లపైకి గోదావరి నది ప్రవాహం రావడంతో పూజ దుకాణాల వారిని ఖాళీ చేయించారు.
గోదావరి నది ప్రవాహం రెండు వైపులా పెరగడంతో పక్కనున్న పంట పొలాల్లోకి వరద నీరు చేరి ముంపునకు గురయ్యాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ప్రవాహం కూడా ఎక్కువగా రావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి బాగాపెరిగింది. ఇన్‌ఫ్లో 11,18,460 క్యూసెక్కులు ఉండగా.. 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ని ఫ్రీ ఫ్లో కండీషన్లో ఉంచడంతో వచ్చిన ప్రవాహం వచ్చినట్టుగా దిగువకు వెళుతుంది. గోదావరి నది ఉధృతి ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook