Heat Waves: తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. కాదు కాదు.. అగ్నిగుండమే అని చెప్పాలి. ఇప్పటికే ఎండ వేడికి పలు జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్, నిజామాబాద్ లో 42.8, రామగుండంలో 4.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఈ రోజు ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బకు 30 మంది మృతిచెందారు.
ఎండలకు ఉక్కపోత తోడు కావడంతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. వడగాలులు తీవ్రంగా వీస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపింది. సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









