)
Hyderabad Rain Fall: భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తింది. కేవలం రెండు గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి హైదరాబాద్ లోని మెజారిటీ ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నాచారం, మౌలాలీ,మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, జీడిమెట్ల, కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, అల్వాల్, శామీర్‌పేట, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాత్రి వర్షం కావడం, పంద్రాగస్టు సెలవుతో నగరవాసులంతా ఇళ్లలోనే ఉండటంతో వాన కష్టాలు తప్పాయి.
అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటల వ్యవధిలో భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 8.8, నల్లవల్లి 6.4, చౌటకుర్, అమీన్ పూర్ 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ 7.6, శివంపేట 6.5, కాళ్లకల్, చిన్న శంకరంపేట 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో హైదరాబాద్ లోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా లంగర్ హస్, కార్వాన్, జియా గూడ, పురానా పూల్, నయాపూల్, ఎంజీబీఎస్, ముసారాం బాగ్ లో నది ఉదృతంగా ప్రవహిస్తోంది.
మరోవైపు హిమాయత సాగర్, గండిపేట లకు భారీగా ఇన్ ఫ్లో వస్తుండంతో మూసీ నదిలోకి నీటిని విడిచిపెడుతన్నారు. దీంతో మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అటు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ టాంక్ లెవల్ కు చేరింది. ఎపుడోకానీ మన నగరానికి చెందిన తటాకాలు పూర్తి స్థాయిలో నిండవు. అటు దుర్గం చెరువు, బతుకమ్మ కుంట సహా హైదరాబాద్ లోని పలు చెరువులు, వాగులు నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దని చెబుతుంది. ఇక జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజిమెంట్ వాళ్లు ఎప్పటి కపుడు రూడ్లపై నిలిచిన నీటిని తోడే పనిలో పడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి