Hyderabad Rains: గత కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు వలన పగటి పూట ఎండ ఉంటూనే సాయంత్రం కాగానే వర్షాలు ముంచెత్తున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. రాత్రి మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. పలు చోట్ల రోడ్లపై ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో రాత్రంత బిక్కు బిక్కు మంటూ గడిపారు.
ఇక బంగాళాఖాతంలో శక్తి తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 40 -50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ముఖ్యంగా నిన్న రాత్రి బండ్లగూడ, అంబర్ పేట, సైదాబాద్ లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మూసారం బాగ్, ఎల్ బి నగర్ ప్రాంతాల్లో 7 సె.మీ పైగా వర్షం పాతం నమోదు అయింది. అటు సరూర్ నగర్, హిమాయత్ నగర్, చార్మినార్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయింది. ఇక ఉప్పల్, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, ముసీరాబాద్ వంటి ప్రాంతాల్లో 4 సెంటిమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయింది. హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ఎస్.ఆర్. నగర్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో 2 సెంటిమీటర్ల నుంచి 3 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయింది. ఈ రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.