Hyderabad Heavy Rains: నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన కొన్ని వారాల తర్వాత మళ్లీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని వారాలకు విరామం వచ్చిన వర్షాలు తాజాగా జోరందుకున్నాయి. తెలంగాణలోని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం కుండపోత వర్షం పడింది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది.
Also Read: Raja Singh Resign: తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా
ఒక్కసారిగా వాతావరణం మారడంతో హైదరాబాద్ శివారులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓయూ క్యాంపస్, లాలాగూడ, ఉప్పల్, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా వాహనదారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
Also Read: Employees Salary Hike: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపు
కుషాయిగూడ, కాప్రా, చర్లపల్లి, మౌలాలి, మల్కాజిగిరి, నేరెడ్మెట్, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానంద నగర్, సుమిత్ర నగర్, మూసాపేట్, వై జంక్షన్ పరిసర ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో మెట్రో స్టేషన్ కింద వాహనదారులు తల దాచుకుంటున్నారు. మరోవైపు ఆఫీసులో ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడం ఒక్కసారిగా వర్షం కురవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు.
కార్యాలయాలు ముగిసి ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడడంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర కష్టాలు పడ్డారు. నాలాలు ఉప్పొంగి ప్రవాహించడంతో స్థానికులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడ్డారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు కిందపడడంతోపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









