Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

Heavy Rain Various Areas In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి అకాల వర్షం దంచి కొట్టింది. వారం తర్వాత కురిసిన వర్షం జోరుగా పడడంతో హైదరాబాద్‌ తడిసిముద్దయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2025, 05:20 PM IST
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్ననికి చల్లబడింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల భారీ ఈదురుగాలులు వీచాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర ప్రజలు ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. కాగా భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. దీంతో పంట నష్టం ఏర్పడింది. ఏయే ప్రాంతాల్లో వర్షం కురిసిందో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సీఎం

ఈ ప్రాంతాల్లో
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఎస్సార్‌నగర్, ఎర్రమంజిల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లి వ్యాప్తంగా వాతావరణం మారింది. కూకట్‌పల్లితో పాటు కేపీహెచ్‌బీ కాలనీలో మోస్తరు వర్ పడింది. ఉదయం నుండి ఎండ తీవ్రతకు గురైన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి జల్లులతో కూడిన వర్షం పడడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

Also Read: Aghori Naga Sadhu: అఘోరీ నాగసాధు సంచలనం.. శ్రీవర్షిణితో ఘనంగా పెళ్లి

చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, రాంనగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మీర్‌పేట్, బాలాపూర్ పరిసరాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన పడింది. మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట, కర్మన్‌ఘాట్, మీర్‌పేట్ పరిసర ప్రాంతంలో వర్షం పడగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.

కూలిన చెట్టు.. ఆటో డ్రైవర్‌కు గాయాలు
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వర్షం కారణంగా చెట్టు కూలి ఆటోపై పడింది. దీంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. చెట్టు పడిపోవడంతో కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడగా వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News