)
Telananga Rains Due To Montha Cyclone Effct 2025: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 8 నుంచి 12 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, యాదాద్రి - భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను నేడు మధ్యాహ్నం నాటికి ఛత్తీస్‌గఢ్ వద్దకు చేరుకుని మరింత బలహీనపడనుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది.మరోవైపు తుపాను ఎఫెక్ట్ తో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట,నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండి పలు చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వర్ష ప్రభావంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పత్తి, మొక్కజొన్న, వరి రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. సత్తుపల్లి సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.
మొంథా తుఫాన్ కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో భారీగా తడిసిపోయిన ధాన్యం. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పిన టార్పలిన్ కవర్లు కనిపించని వైనం. రైతులే కిరాయికి పట్టాలు తెచ్చి ధాన్యం రాశులపై కప్పినా ఫలితం శూన్యం అని చెప్పాలి.
తెలంగాణతో పాటు మరాఠవాడా సమీప ప్రాంతాల్లో ముంథా తుపాను ఎఫెక్ట్ తో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నాందేడ్,
హింగోలి, పర్బణీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణకు ఆనుకొని ఉన్న విదర్భలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విదర్భలోని బుల్దానా, అకొలా, అమరావతి, యవత్మాల్, నాగ్ పూర్, వార్డా ప్రాంతాల్లో భారీ వర్షాలతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.
వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పాకురుతో జారీ పడే అవకాశాలున్నాయి. దీంతో ఆయా సమీప ప్రాంతాలకు వెళ్లకపోవడమే అత్యుత్తం. ఏదైనా అత్యవసరమై ప్రయాణం చేసేటపుడు వాతావరణ సమాచారం తెలుసుకొని ప్రయాణం చేయండి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు పంటలు, పశువులను సురిక్షిత ప్రాంతాలకు తరలించాలని చెబుతున్నారు. అంతేకాదు అత్యవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయాలి. నెంబర్స్ గుర్తు లేకపోతే 100కు డయల్ చేయండి. వాళ్లే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తారు.
తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా 20.08 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. అటు అమ్రాబాద్ లో 19.7 సెంటీ మీటర్లు నమోదు అయింది. అటు నల్గొండ జిల్లా తెల్డేవరపల్లిలో 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నాగర్ కర్నూల్ వెల్దూర్ లో 18.3 సెంటీమీటర్లు ఐనోలులో 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.