)
Telangana Rains: నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. అంతేకాదు పలే జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటోంది. నేడు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల వరకు వానలు కురుస్తాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒరిస్సా తీరం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిక్కుల నుంచి వీస్తున్న గాలులు కారణంగా భారీ వర్షాలు కువరనున్నాయి.
కొన్ని చోట్ల ఈ రోజు, రేపటితో పాటు మరో ఐదు రోజులు పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. అంతేకాదు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో బయటకు వెళ్లేవారు అప్రమత్తతలో మెలగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తత మెలగాలని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.