)
Railway track washed away in kamareddy due to heavy rains: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు స్టేట్స్ లలో భారీగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
కామారెడ్డి , సికింద్రాబాద్ పరిధిలోని రైల్వే ట్రాక్ వరద నీళ్లకు కొట్టుకుని పోయింది. ఈ క్రమంలో 12 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా.. నేషనల్ హైవే 44 వద్ద భిక్నూర్ సమీపంలోని టోల్ ప్లాజా నీళ్లతో నిండిపోయింది. కామారెడ్డి సికింద్రాబాద్, నిజామాబాద్ తిరుపతి రైళ్లు రద్దు చేశారు. కాచిగూడ మెదక్ రైలునుకూడా అధికారులు రద్దుచేశారు. మరోవైపు.. తిమ్మారెడ్డి వద్ద కళ్యాణివాగు భీకంగా పొంగిపొర్లుతుంది.
కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత
జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు
కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు https://t.co/dNiDFVoiTP pic.twitter.com/aSwTiTlBLT
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2025
దీని సమీపంలో..కొంత మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో అన్నిస్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి, హైదరాబాద్ నేషనల్ హైవే మార్గం మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
వాగులో కొట్టుకుపోయిన కారు
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు
కారులో నలుగురు ప్రయాణికులు ఉండొచ్చని చెప్తున్న స్థానికులు https://t.co/WeEeZXFxyu pic.twitter.com/65fy7L8G7x
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2025
రైల్వేట్రాక్ ఘటనపై కేంద్ర మంత్రి ఆరా..
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ క్రమంలో.. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కేంద్ర మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని కేంద్ర మంత్రి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను కోరారు.
మరోవైపు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న 5గురు వ్యక్తుల్నికాపాడాటానికి కూడా కేంద్ర మంత్రి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతంసానుకూలంగా స్పందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.