High Alert: 35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ.. రంజాన్ రెండో శుక్రవారం, సీపీ హై అలెర్ట్..

CP High Alert in Hyderabad: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. తెల్లవారు జాము నుంచే రంగులు చల్లుకుంటున్నారు. బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు కూడా చెప్పుకోవడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలెర్ట్‌ ప్రకటించారు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 14, 2025, 08:47 AM IST
High Alert: 35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ.. రంజాన్ రెండో శుక్రవారం, సీపీ హై అలెర్ట్..

CP High Alert in Hyderabad: నేడు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా భద్రత బలగాల మధ్య పండుగ వేడుకలు నిర్వహించనున్నారు. పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలపై పోలీసు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఎవరిపై రంగులు చల్ల వద్దని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు ఉంటాయని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source

హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండో శుక్రవారం ఒకేరోజు రావడంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌ నిర్వహించాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్, డీసీపీ చైతన్యకుమార్ సమావేశంలో పాల్గొన్నారు.

కమిషనర్ సీపీ ఆనంద్ నిన్న పాతబస్తీలో పర్యటించారు. హోలీ సందర్భంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో కామ దహనం కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పాతబస్తీలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. శాంతియుత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. 

హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మద్యం షాపులు కూడా బంద్. అంతేకాకుండా చికెన్, మటన్ షాపులు కూడా బంద్ పాటించాలని నిన్న సీవీ ఆనంద్ ఆదేశించారు. 

ఇదీ చదవండి: చేప కొరికితే  చెయ్యి తీసేయాల్సి వచ్చింది.. అరుదైన ఇన్ఫెక్షన్ తస్మాత్‌ జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు హోలీ విషెస్ చెప్పారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హోలీ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల జరుపుకునే ఈ పండుగ సమైక్యతతో అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుతున్న అని ఎక్స్ వేదికగా తెలియజేశారు. రసాయనాలతో కూడిన రంగులను ఉపయోగించవద్దని కూడా సూచించారు.

హోలీ అంటేనే రంగుల పండుగ ఒకరిపై ఒకరు కలర్స్ చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే కళ్లలో పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ రంగులు ఉపయోగించకుండా కేవలం ఆర్గానిక్ రంగులు ఉపయోగించవచ్చని లేదా పసుపు, కుంకుమ కూడా ఉపయోగించి హోలీ పండుగ ఆడుకోవచ్చని సూచించారు. అయితే హోలీ ఆడే ముందు శరీరం జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఆడటం వల్ల త్వరగా రంగులు వదిలి పోతాయని, ఫుల్ స్లీవ్లు దుస్తులు ధరించాలని సూచించారు. అంతేకాదు చెరువులు, కాలువల దగ్గర ఉండే వ్యక్తులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.  జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇదీ చదవండి:  Snakes: ఈ 2 వస్తువులు ఉంటే.. పాములు గంటకు 12 మైళ్ల స్పీడ్‌తో మీ ఇంటికి పరుగెత్తుకుని వస్తాయి..!

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News