Heat Waves in Telangana: తెలంగాణ సూర్య భగవాడి భగభగలకు ప్రజలు బెంబేలేత్తుతున్నారు. అల్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత నెలాఖరు వరకు కొనసాగనుంది. బయట అడుగుపెడితే చాలు ఎండ సుర్రు మనిపిస్తోంది. రాబోయే కొన్ని రోజులు పాటు ఉత్తరాది నుంచి వీచే వడగాలుల ప్రభావం వలన ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్టు వాతావరణ శాఖ తెలపనుంది. తెలంగాణలో ఎండలు తీవ్రత పెరిగిపోతుంది. రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నరెండు నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పగలు వడగాల్పులు రాత్రివేళలో వేడి వాతావరణం నమోదవుతుందని హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా44.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణం కన్నా 3.6డిగ్రీలు ఎక్కువ. వడగాల్పుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు.
తెలంగాణ ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది. ఉదయం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నార్మల్ గా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదు అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ ప్రభావం కొనసాగుతుంది.విపరీతమైనటువంటి ఉక్కపోత వడదెబ్బ ప్రభావం కూడా చాలా మొదలైంది. వడదెబ్బ కారణంగా మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి వరకు దాదాపు 26 మంది వడదెబ్బతోటి ఈ సీజన్ లో చనిపోయినట్టుగా కూడా ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. అంత కంటే ఎక్కువ మంది కన్నుమూసినట్టు సమాచారం. ఎందుకంటేవాతావరణ శాఖ చెప్పినట్టు మరొక మూడు నాలుగు రోజుల పాటు కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత ప్రారంభం అవుతుంది. మరొక మూడు రోజుల పాటు మనకు సాధారణం కంటేమూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు పగలు వడకాల్పులు రాత్రివేళలో వేడి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో మనకు రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో44.3 మెదక్ లో 43.4, రామగుండంలో 42.8 ఖమ్మం జిల్లాలో 41డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు 40 పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
రాత్రి హీటి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి కూడా మనకు రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతుంది. ఎంత వేడి ప్రభావాన్నితగ్గించుకోవడానికి ఇండ్లల్లో కూలర్లు వేసినా ఏసీలు వేసినా కూడా హీట్ అయితే ఇంకా తగ్గడం లేదు. ఎండలకు ఇంట్లో నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో ప్రతి గంటలకు ఓ అరలీటరు నీటితో పాటు లీటరు నీరును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









